Nijam with smita : ‘నాపై కోడి గుడ్లు విసిరారు’.. స్మిత షోలో చేదు అనుభవాన్ని బయటపెట్టిన మెగాస్టార్!?

First Published | Feb 8, 2023, 3:04 PM IST

సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి మొదటి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు కలిగిన ఓ చేధు అనుభవాన్ని బయటపెట్టారు. 
 

ప్రముఖ గాయని స్మిత (Smita) కొత్త టాక్ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు. ‘నిజం విత్ స్మిత’ టైటిల్ తో ఇటీవల ఈ షోను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మొదటి ఎపిసోడ్ ను సిద్ధంగా చేశారు.

సింగర్ స్మిత హోస్ట్ గా Nijam with Smita టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్  కు మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మిత చిరంజీవి నుంచి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టించేలా ప్రశ్నలు సంధించారు. 
 


ఇందుకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. యూట్యూబ్ లో దూసుకుపోతోంది. చిరంజీవికి స్వాగతం పలుకుతూ ప్రోమో స్టార్ అవుతుంది. చిరంజీవి ఫస్ట్ క్రష్, తదితర సరదా ప్రశ్నలకు చిరంజీవి ఆకట్టుకునేలా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
 

అయితే, ప్రోమో ద్వారా టాలీవుడ్ నెంబర్ హీరోగా ఉన్న చిరంజీవికి కూడా ఓ చేథు అనుభవం జరిగిందని తెలుస్తోంది. ‘మీరు ఎదిగే క్రమంలో ఎదురైన అవమానాలు? అనుమానాలు? లాంటివి’ అంటూ స్మిత చిరును ప్రశ్నించింది. ఇందుకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు.  
 

‘ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో.. ఓ సందర్భంలో జగిత్యాలకు వెళ్లాను.  అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ పైనుంచి పూల వర్షం కురిపించారు. కానీ కొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడి గుడ్లతో కొట్టారు.’ అంటూ బదులిచ్చారు. ఇంతకీ చిరంజీవికి అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.
 

మరోవైపు నెపోటిజంపైనా చిరు స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఫుల్ ఎపిసోడ్ వస్తేనే  చిరంజీవి ఏం చెప్పారనేది స్పష్టత రానుంది. ఫిబ్రవరి 10న చిరంజీవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అలాగే ఈ షోకు నేచురల్ స్టార్ నాని, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, అడివిశేష్, భరత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరయ్యారు. దీంతో ఈటాక్ షో సెన్సేషన్ గా మారనుంది.
 

Latest Videos

click me!