కానీ తను నర్స్ వద్దంది. ఎందుకంటే నా గురించి ఆమెకి పూర్తిగా తెలుసు. ఒక అమ్మ కొడుకుని చూసుకున్నట్లు నన్ను నా భార్య చూసుకుంది. నా భార్య వల్లే నేను కోలుకోగలిగాను. నాకు సూదులు అంటే చచ్చేంత భయం. ఇంజక్షన్ వేయించుకోవడానికి కూడా భయపడతాను. మా టెన్త్ యానవర్సరీ రోజున నీకు ఏం కావాలి చెప్పు.. ఏమైనా చేస్తా అని తనని అడిగా. నాకు ఏమీ వద్దు.. అన్నీ ఉన్నాయి. మీరు, పిల్లలు పక్కన ఉన్నారు అది చాలు అని తెలిపింది.