నందమూరి తారక రామారావు.. తెలుగు తొలి తరం హీరోల్లో ఒకరు. తెలుగు సినిమా దశ దిశని మార్చిన వారిలో ప్రథములు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ వంటి వారు తెలుగు చిత్ర పరిశ్రమకి తొలి తరం నటులుగా మనం కీర్తిస్తుంటారు. అభిమానిస్తుంటామనే విషయం తెలిసిందే. మద్రాస్ కేంద్రంగా తెలుగు సినిమా పురుడు పోసుకుంది. నెమ్మదిగా ఎదుగుతూ ఇప్పుడు ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీగా ఎదిగింది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
అయితే ఇంతటి గొప్పటి స్థానానికి రావడానికి పునాది వేసింది ఎన్టీఆరే అని చెప్పాలి. మద్రాస్ కేంద్రంగా ఉన్న తెలుగు పరిశ్రమని హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. ఆయనతోపాటు ఏఎన్నార్ సమానంగా కృషి చేశారు.
వారి వారసత్వాన్ని ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కొనసాగిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే నటుడిగా ఎన్టీఆర్ ని ఎంతో మంది అభిమానిస్తారు. ఆయన వేసిన కృష్ణుడు, రాముడు వంటి పాత్రలనే దేవుడిగా భావిస్తారు. రాముడు, కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడేమో అని ఆరాధిస్తుంటారు. రాముడి స్థానంలో రామారావు ఫోటో పెట్టుకుని పూజించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.
మద్రాస్‌లో ఉండగా, ఆయన్ని చూసేందుకు ఎంతో మంది అభిమానులు రోజూ ఇంటికి వెళ్లేవారట. అటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా, ఇటు రామారావుని దర్శించుకుని వెళ్లేవారట. అప్పట్లో దీన్ని కథలు కథలుగా చెప్పేవారు. ఇప్పుడూ చెబుతుంటారు. ఎన్టీ రామారావు అంటే వారికి అంతటి అభిమానం. ఇలా ఆరాధించే వారిలో సినిమా వాళ్లు ఉన్నారు, ఆయన తర్వాత తరంగా వచ్చిన హీరోలు, సూపర్ స్టార్లు ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడిగా వెలుగొందిన శోభన్ బాబుకి కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఆ అభిమానం ఎంతంటే తన ఇంటి హాల్‌లో ఓ పెద్దని ఎన్టీఆర్ ఫోటోని పెట్టుకుని ఆరాధించేంతటి అభిమానం కావడం విశేషం. ఆయన ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే మొదటగా కనిపించేది రామారావు ఫోటోనే అట. ఓ ఈవెంట్‌లో కృష్ణంరాజు ఈ విషయాన్ని తెలిపారు.
పూజగదిలో ఎన్టీఆర్ రామారావు ఫోటో ఉంటుందని తెలిపారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే శోభన్‌బాబు సినిమాల్లోకి వచ్చారట. అంతగా అభిమానించే శోభన్‌బాబు.. ఎన్టీఆర్ మాటని మాత్రం తిరస్కరించారట. ఆయన రిక్వెస్ట్ చేస్తే నిర్మొహమాటంగా నో చెప్పాడట. కాదు పొమ్మన్నాడట. మరి అసలేం జరిగిందనేది చూస్తే.
మద్రాస్ కేంద్రంగా ఉన్న తెలుగు చిత్రపరిశ్రమని హైదరాబాద్‌లో అభివృద్ధి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు తెలుగు ఆర్టిస్టులు, దర్శక,నిర్మాతలు. దీంతో హైదరాబాద్‌కి షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇక స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించారు.
ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. నమ్మదిగా హైదరాబాద్‌లో టాలీవుడ్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద చిత్ర పరిశ్రమగా తెలుగు ఎదగడం విశేషం. అయితే అప్పుడు అంతా హైదరాబాద్‌కి తరలి వస్తుండగా, అప్పటికే సూపర్ స్టార్‌గా రాణిస్తున్న శోభన్‌బాబు మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు.
ఆయన్ని ఎన్టీఆర్ హైదరాబాద్‌కి రావాలని అడిగారట. కానీ శోభన్‌బాబు తిరస్కరించాడట. చాలా సార్లు రిక్వెస్ట్ కూడా చేశాడట. అయినా కాదు నో చెప్పాడట. తన ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఫ్యామిలీ అంతా ఇక్కడే(మద్రాస్)లోనే సెటిల్ అయ్యిందని, ఇవన్నీ విడిచి రాలేను అని నిర్మొహమాటంగా చెప్పేశాడట. అభిమానం అభిమానమే, పర్సనల్ పర్సనలే అని నిరూపించాడు శోభన్‌బాబు. ఇక చేసేదేం లేక సైలెంట్ అయిపోయాడు రామారావు.