
అసభ్యత, అశ్లీల కంటెంట్‌తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్ ఇప్పుడు సమస్యలో పడనుంది. స్కూల్ కు వెళ్లే పిల్లలను లక్ష్యంగా చేసుకుని లైంగిక కార్యకలాపాలను ప్రదర్శిస్తున్న ఉల్లూ యాప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) కేంద్రాన్ని కోరింది.
ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో కేంద్రానికి ఈమేరకు లేఖ రాశారు. యాప్ తన సబ్‌స్ర్కైబర్లకు అశ్లీల దృశ్యాలను చూపిస్తున్నదని తెలిపారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ దీనిపై తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. NCPCR ఇచ్చిన లెటర్ లో ఉల్లూ యాప్... ఏజ్ వెరిఫికేషన్ లేకుండా అన్ని మొబైల్ ప్లాట్ ఫామ్ లలో ఈజీగా ఈ యాప్ లభ్యమవుతోందని అన్నారు. చిన్న పిల్లలను టార్గెట్ చేయటం,స్కూల్ ఏజ్ పిల్లల పాత్రలను పెట్టి శృంగార భరిత సన్నివేశాలతో కంటెంట్ ని యాప్ లో పెట్టండ వంటివి చేస్తోందని ప్రధాన ఆరోపణ.
ఈ ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్ పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ చర్యలు అయితే తీసుకోలేదు. ఈ బీ-గ్రేడ్ యాప్ చాలా కాలంగా ఇందులో కంటెంట్ తో వైరల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వాస్తవానికి ఈ ఫ్లాట్ ఫాం కంటెంట్ పూర్తిగా శృంగార భరిత కంటెంట్ పై దృష్టి పెడుతూ.. అసభ్యతను, అశ్లీలతను వ్యాప్తి చేస్తుందంటూ విమర్శలను అందుకుంంది. అయితే...రకరకాల కారణాలతో ఈ యాప్ కు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అయితే ఇప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీసుకునే చర్యలతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాప్ ని మూసేసే అవకాసం ఉందని వార్తలు వస్తున్నాయి.
భారతదేశంలో ఈ కంటెంట్ ను ఆస్వాదించే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వలనేమో విపరీతంగా వీక్షకులు ఉన్నారు. ఈ ఉల్లూ దేశీ యాప్ శృంగార సిరీస్ లు, షార్ట్ సినిమాల కంటెంట్ తో నిండిపోయి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉల్లుకు సుమారు 2.8 మిలియన్ల పెయిడ్ సబ్ స్క్రైబర్ లు ఉన్నట్లు తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఈ ఓటీటీ వినియోగం భారీ ఎత్తున ఊపందుకుంది.
ఇక గతంలో ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 కింద ఈనెల 4న కేసు ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు.
కాగా 2013లో బాత్ బాన్ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్..డాన్స్ బార్ సినిమాతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. ఆ తర్వాత 2019లో ఉల్లూ యాప్‌ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్,భోజ్‌పురి,తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అలాగే ఈ OTT ప్లాట్‌ఫారమ్ ఉల్లు డిజిటల్ తన IPOను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓ నుంచి రూ.135-150 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలో దాదాపు 62.6 లక్షల కొత్త షేర్లు జారీ కానున్నాయి. ఉల్లు డిజిటల్ IPO కోసం SEBI నుండి ఆమోదం పొందినట్లయితే, ఇది ఇప్పటివరకు అతిపెద్ద SME IPO కావచ్చు.
ఉల్లు యజమాని ఎవరు?కంపెనీ యజమానులు విభు అగర్వాల్ , అతని భార్య మేఘా అగర్వాల్. ప్రస్తుతం విభు , మేఘా అగర్వాల్ ఉల్లులో 95 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలిన 5 శాతం వాటాను పబ్లిక్ వాటాదారు జెనిత్ మల్టీ ట్రేడింగ్ DMCC కలిగి ఉంది. ఉల్లు డిజిటల్ ఉల్లు యాప్/వెబ్‌సైట్ ద్వారా వివిధ రకాల వినోద కంటెంట్‌ను అందిస్తుంది. ఇందులో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు , షోలు ఉన్నాయి.IPO కంపెనీ డబ్బును ఎక్కడ ఉపయోగిస్తుందికొత్త కంటెంట్ తయారీ, అంతర్జాతీయ షోల హక్కుల కొనుగోలు, టెక్నాలజీలో పెట్టుబడులు, సిబ్బంది నియామకం కోసం ఐపీఓ నుంచి సేకరించిన నిధులను కంపెనీ ప్రధానంగా వినియోగించనుంది. ఇది కాకుండా, డబ్బు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు , సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు కూడా ఉపయోగించబడుతుంది.