సౌందర్య కాదు, జగపతిబాబుకి ఇండస్ట్రీలో బెస్ట్ లేడీ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? అంత క్లోజా?

Published : Feb 12, 2025, 02:50 PM IST

Jagapathi babu Friend: జగపతిబాబు ఇండస్ట్రీలో ఎన్నో ఎఫైర్స్ నడిపించారనే రూమర్స్ ఉన్నాయి. అయితే ఆయనకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓ హీరోయిన్‌ తన బెస్ట్ ఫ్రెండ్‌ అని తెలిపారు జగపతిబాబు. అదేంటో చూద్దాం.   

PREV
14
సౌందర్య కాదు, జగపతిబాబుకి ఇండస్ట్రీలో బెస్ట్ లేడీ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? అంత క్లోజా?
Jagapathi babu Friend

జగపతిబాబు ఒకప్పుడు స్టార్‌ హీరోగా ఎదిగి, ఇప్పుడు స్టార్‌ యాక్టర్‌గా రాణిస్తున్నారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత రాజేద్రప్రసాద్‌ తనయుడు అయిన జగపతిబాబు ఇండస్ట్రీలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు.

తన వాయిస్‌ బాగా లేదని, డబ్బింగ్‌కి సెట్‌ కాదు అనే స్థితి నుంచి తన వాయిసే బెస్ట్ అనే స్థాయికి ఎదిగారు. అంతటి పేరు తెచ్చుకున్నారు. తన నెగటివ్‌నే పాజిటివ్‌గా మార్చుకుని స్టార్‌ హీరోగా రాణించారు.

24
Jagapathi babu Friend

ఇప్పుడు విలన్‌ పాత్రలు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బలమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. విలక్షణ నటుడిగా మెప్పిస్తున్నారు. అయితే జగపతిబాబు తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. ఇండస్ట్రీలో తన స్నేహం గురించి వెల్లడించారు.

చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనే ప్రశ్నకి జగపతిబాబు రియాక్ట్ అవుతూ యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పేరు చెప్పారు. అయితే ఆయన కంటే ఓ హీరోయిన్‌తో స్నేహం ఎక్కువగా ఉంటుందన్నారు. 


 

34
soundarya

సాధారణంగా అంతా సౌందర్య అనుకుంటారు. కానీ ఆమె కాదు, రమ్యకృష్ణ తనకు బెస్ట్ ఫ్రెండ్‌ అని తెలిపారు జగపతిబాబు. రమ్యకృష్ణ, తాను దాదాపు ఒకేసారి కెరీర్‌ ప్రారంభించినట్టు తెలిపారు.

నంది అవార్డు కూడా ఒకేసారి తీసుకున్నామని, తనతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటానని, బెస్ట్ కంపానియన్‌ అని వెల్లడించారు జగపతిబాబు. ఫ్యాన్స్‌ తో సెల్ఫ్‌ చిట్‌ చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  వీడియో లింక్‌
 

44
ramya krishnan

జగపతిబాబు, రమ్యకృష్ణ కలిసి చాలా సినిమాలు చేశారు. బెస్ట్ పెయిర్‌గానూ నిలిచారు. వీరి కాంబినేషన్‌లో `అల్లరి ప్రేమికుడు`, `కుషీకుషీగా`, `ఆయనకు ఇద్దరు`, `బాలరామకృష్ణులు`, `చిలక్కొట్టుడు`, `జైలర్‌గారి అబ్బాయి`, `శివకాశీ` వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆడియెన్స్ ని అలరించారు.

ఇక జగపతిబాబు ఇటీవల `పుష్ప 2`, `మిస్టర్‌ బచ్చన్‌`, `సింబా`, `ది ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించి బిజీగా ఉన్న జగపతిబాబు నేడు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

read  more: Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్‌ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?

also read: ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్‌ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్‌ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories