అక్కినేని నట వారసుల్లో మూడో తరం హీరోగా నాగచైతన్య ఎంతో కష్టపడుతున్నాడు. తన తాత, తండ్రిలాగా అంత త్వరగా స్టార్టమ్ రాలేదు చైతూకి. కాని మంచి సినిమాలు చేస్తూ.. మంచి పేరు మాత్రం సాధించుకున్నాడు. టైర్ 1 హీరోల లిస్ట్ లో మాత్రం చేరలేకపోతున్నాడు. అయితే వారసత్వం గురించి మాట్లాడకుండా.. తన మార్క్ సినిమాలు చేసుకుంటూ సొంత ఇమేజ్ ను మాత్రం సాధించగలిగాడు చైతూ.