ఆ హీరో తలచుకుంటే సగం హైదరాబాద్ కొనేయగలడా... మళ్ళీ స్టార్ కూడా కాదు, అంత రిచ్ ఎలా అయ్యాడు!

First Published Jul 27, 2024, 9:58 AM IST


టాలీవుడ్ టైర్ టు హీరో స్టార్ హీరోలకు మించి సంపద కలిగి ఉన్నాడట. అతడు తలచుకుంటే సగం హైదరాబాద్ ని కొనేస్తాడట. చాలా సింపుల్ గా కనిపించే ఆ హీరో ఎవరో తెలిశాక మీరు షాక్ అవుతారు.. 
 

Tollywood


టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. అరడజనుకు పైగా స్టార్ హీరోలు మన పరిశ్రమలో ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున, మహేష్ బాబు రిచెస్ట్ హీరోలుగా ఉన్నారు. 

Top Ten Pan India Stars


అయితే వీరందరి కంటే ఎక్కువ ఆస్తులు ఒక టైర్ టు హీరోకి ఉన్నాయట. ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్.  ఆ కథ ఏమిటో చూద్దాం. విజయవాడకు చెందిన శర్వానంద్ హైదరాబాద్ లో చదువుకున్నాడు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి ఆయన క్లాస్ మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి వరకు వీరు కలిసి చదువుకున్నారని సమాచారం. 

Latest Videos


2004లో శర్వానంద్ నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. యువసేన మూవీతో హీరో అయ్యాడు. నలుగురు హీరోల్లో ఒకడిగా శర్వానంద్ నటించాడు. యువసేన హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. గమ్యం, ప్రస్థానం చిత్రాలు శర్వానంద్ ని హీరోగా నిలబెట్టాయి. రన్ రాజా రన్, మహానుభావుడు, శతమానం భవతి చిత్రాలతో శర్వానంద్ టైర్ టు హీరోల జాబితాలో చేరాడు. 
 

శర్వానంద్ పేరెంట్స్ బాగా స్థితిమంతులు అట. వీరిది బిజినెస్ ఫ్యామిలీ అని సమాచారం. హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా శర్వానంద్ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉంటాయట. ఒక సన్నిహితుడితో కారులో హైదరాబాద్ లో సంచరిస్తూ.. ఆ స్థలం మాదే, ఈ ఇల్లు మాదే అంటూ... పలు ఏరియాల్లో ఉన్న తమ ఆస్తులు చూపించాడట శర్వానంద్. 

ఈ విషయాన్ని గతంలో శర్వానంద్ ని ఓ జర్నలిస్ట్ నేరుగా అడిగారు. హైదరాబాద్ లో ప్రతి మూలన మీకు ఆస్తులు ఉన్నాయట. అసలు సగం హైదరాబాద్ మీదేనట? అని అడగ్గా... శర్వానంద్ నవ్వుతూ సమాధానం చెప్పారు. సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులు లేవు కానీ... మాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవమే అన్నాడు. అయితే ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా, టీనేజ్ నుండి నా ఖర్చులకు నేను సంపాదించుకునేవాడిని, ఫ్యామిలీ మీద ఆధారపడటం నచ్చదు.. అన్నాడు. 

click me!