ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ నటుడు ఉన్నారు. గొప్ప గొప్ప పాత్రలు చేసినవాళ్లు ఉన్నారు. పాత్రల్లో ప్రయోగాలు చేసిన వాళ్లు ఉన్నారు. ఎక్కువ పాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. అలాంటివారిలో కమల్ హాసన్ కూడా ఒకరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్.. ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో చేయని విజయాలు లేవని చెప్పొచ్చు.
చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ..? మెగా ఫ్యాన్స్ కు పండగే..
ఆ విధంగా ఒకే సినిమాలో విభిన్నమైన పాత్రల్లో నటించి పలు విజయాలు అందుకున్న కమల్ హాసన్.. ఒక సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా అపూర్వ సోదరులు, మైఖేల్ మదన కామరాజన్ సినిమాల నుంచి దశావతారం సినిమాల వరకు ఎన్నో టెక్నికల్ ట్రిక్స్ ని తన సినిమాల్లో ప్రవేశపెట్టి గొప్ప నటుడిగా ఎదుగారు.
నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?
Kamal Haasans Indian 2 report
అయితే కమల్ హాసన్ చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి.. ఆయన దశావతారంలో చేసిన 10 పాత్రలు చాలా గొప్పగా అనిపించాయి. అందుకే ఒ్క సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడిగా కమల్ హాసన్ పేరు చెపుతుంటారు. కాని దక్షిణాది సినిమా విషయానికి వస్తే.. కమల్ హాసన్ ఒక్క సినిమాలో కూడా ఎక్కువ పాత్రలు పోషించిన నటుడు కాదు అని మీకు తెలుసా..?
ఇంతకీ ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన వ్యక్తి ఎవరో కాదు అది జాన్సన్ జార్జ్ అనే మలయాళ నటుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
నటుడు జాన్ జార్జ్ 2018లో విడుదలైన మలయాళ చిత్రం "ఆరను జన్"లో 45 పాత్రలు పోషించారు. ఇందులో గాంధీ, జీసస్ క్రైస్ట్, డావిన్సీ, హిట్లర్, వివేకానంద మొదలైన పాత్రలు ఉన్నాయి. ఇది ఆ సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఇలా దేశంలో ఎంతో మంది గొప్ప నటులు కూడా సాధించలేని రికార్డ్ ను జాన్ జార్జ్ సాధించాడు.