చిరంజీవి‌ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ..? మెగా ఫ్యాన్స్ కు పండగే..

First Published | Jul 30, 2024, 12:29 PM IST

మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టైమ్ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. మెగా కుటుంబంనుంచి ఉన్న పెద్ద హీరోలు ముగ్గురితో కలిసి మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతన్నట్టు సమాచారం.

Chiranjeevi-pawan kalyan- ram charan

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఈ ముగ్గురు హీరోల సినిమాల రిలీజ్ ను పండగలా చేసుకుంటారు ఫ్యాన్స్. ఒకే ఫ్యామిలీలో టైర్ 1 హీరోలుగా ఉన్న ఈ ముగ్గరు హీరోల సినిమాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారుఫ్యాన్స్.
 

నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?

ఇక ఈముగ్గరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే.. ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో అద్భుతమైన కథతో ఫ్యాన్స్ ముందుకు వస్తే..? ఇక అది మెగా ఫ్యాన్స్ కు ఓ పెద్ద ఉత్సవమే అవుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సందర్భంకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ళుగా ఈ మల్టీ స్టారర్ సినిమా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక త్వరలోనే తీరే అవకాశం కనిపిస్తోంది. 
 


ఈమధ్య టాలీవుడ్ లో  మల్టీస్టారర్ల వేవ్  తక్కువయ్యింది.  ఒకప్పుడైతే హీరోలు ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఇట్రెస్ట్ చూపించేవారు. కాని ఈమధ్య ఆ సినిమాలు తగ్గాయి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి మల్టీ స్టారర్ డిమాండ్స ఎక్కువ అయ్యాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యామిలీలనుంచి..  ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండగా.. వారంతా కలిసి సినిమాలు చేస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాతో అభిమానుల కోరికను తీర్చారు. 
 

ఇక ఇప్పుడు ఈ విషయంలో మెగా ఫ్యామిలీ వంతు వచ్చింది. మెగా హీరోలు ముగ్గురితో ఓ ఎపిక్‌ మల్టీస్టారర్‌ రాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజం అయితే మెగా అభిమానులకు ఇంతకు మించిన శుభవార్త మరోటి ఉండదు.. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు కలిసి ఓ సినిమాలో నటిస్తే  కన్నుల పండుగగా ఉంటుంది. ఆ టైమ్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈరకంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. వీరు ముగ్గురితో భారీ మల్టీ స్టారర్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది... అంతే కాదు ఆయన ఓ కథను కూడా రాసుకున్నట్టు సమాచారం. చిరంజీవి, పవన్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఓ సినిమా అనుకున్నానని, ఓ లైన్‌ ఎప్పట్నుంచో వర్క్‌ చేసి పెట్టుకున్నానని, అది వర్క్‌ అవుటైతే మాత్రం అదే పెద్ద పాన్‌ ఇండియా సినిమా అవుతుందని హరీశ్‌ శంకర్‌ ఓ సందర్భంలో చెప్పారట. 
 

గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు నిర్మాత సుబ్బరామిరెడ్డి. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్టు ఏ మాత్రం ముందుకు కదలలేదు. అయితే వీరికి తోడు రామ్ చరణ్ కూడా కలిస్తే.. అది ఇంకో అద్భుతం అవుతుంది. నిజంగా  హరీశ్‌ శంకర్‌ అనుకున్న సినిమా అయినా స్క్రీన్ మీద నిజం అయితే.. బలే ఉంటుంది అనుకుంటున్నారు  ఫ్యాన్స్‌.

అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా మారాడు.. మరి చిరంజీవి ఈ సినిమా కోసం రెడీగా ఉన్నా.. పవన్, రామ్ చరణ్ లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం కుదురుతుందా..? అసలు ఇది సోషల మీడియా గాసిప్ గానే మిగిలిపోతుందా.. ఫ్యూచర్ లో సాధ్యం అవుతుందా అనేది చూడాలి. 

Latest Videos

click me!