నటిగా స్టార్‌గా వెలిగిన ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా బాధలు పడటం ఏ ఆర్టిస్ట్ కైనా చాలా ఇబ్బందికరమైన విషయం. తాజాగా దర్శకుడు, నటుడు హర్షవర్థన్ ఈ విషయాన్ని తెలిపారు. నటుడిగా చేయడం సుఖం. దర్శకులుగా మారితే,అవి ఆడకపోతే మానసికంగా చాలా డౌన్ అయిపోతాం, ప్రశాంతత కోల్పోతాం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాం. సావిత్రి విషయంలో అదే జరిగిందన్నారు. అసలే భర్త విషయంలో, ఫ్యామిలీ విషయంలో ఆమె ఇబ్బందుల్లో ఉంది. దీనికితోడు ఇలా డైరెక్షన్ చేసి, నిర్మాతగా మారి చాలా డబ్బులు కోల్పోయింది. నటిగా అవకాశాలను కూడా కోల్పోయింది. ఇదంతా ఆమెకి పెద్ద దెబ్బగా మారిందన్నారు హర్షవర్థన్. అలా కాకుండా మంచి పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చి ఉంటే, ఆమె కెరీర్ మరోలా ఉండేదని, ఉన్నంత కాలం రాణిలా వెలిగేదన్నారు నటుడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.