Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్‌.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?

Published : Feb 09, 2025, 07:28 PM IST

Akhanda 2 Update: బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. 

PREV
15
Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్‌.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?
balakrishna, akhanda 2, aadhi pinisetty

Akhanda 2 Update: బాలకృష్ణ `డాకు మహారాజ్‌` విజయం తర్వాత ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 14 రీల్స్ పతాకంపై బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతుంది.

సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో వేసిన సెట్‌లో యాక్షన్‌ సీక్వెన్స్ లు రూపొందిస్తున్నారట. ఫైట్‌ మాస్టర్‌ రామ్‌, లక్ష్మణ్‌ పర్యవేక్షణలో యాక్షన్‌ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారట. 
 

25
Akhanda

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించే అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో విలన్‌గా ఆదిపినిశెట్టిని దించుతున్నాడట బోయపాటి. బాలయ్యని ఢీ కొట్టేందుకు ఆదిని దించినట్టు సమాచారం.

`అఖండ` సినిమాలో విలన్‌ బలంగా చూపించలేకపోయారు. రెగ్యూలర్‌గానే అనిపించాడు. బాలయ్య ముందు విలన్‌ పాత్రలు నిలవలేకపోయాయి. దీంతో తేలిపోయిన ఫీలింగ్‌ కలిగింది. 
 

35
aadhi pinisetty

విలన్‌ పాత్రలు బలంగా లేకపోతే సీన్‌ రక్తికట్టడం కష్టం. సినిమా తేలిపోతుంది. అదే సమయంలో హీరోయిజం కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఇమేజ్‌ ఉన్న నటుడు అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఆది పినిశెట్టిని ఎంపిక చేశారట. అయితే ఇప్పటికే `సరైనోడు`లో విలన్‌గా నటింప చేశారు బోయపాటి.

 

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ మూవీలో ఆది పినిశెట్టి రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. బన్నీతో పోరాడేందుకు `సరైనోడు` అనిపించాడు. అందుకే ఇప్పుడు `అఖండ 2`లో విలన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 

45
akhanda

ఎంపిక చేయడమే కాదు, ఏకంగా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య, ఆదిలపై యాక్షన్‌ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారట. రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్ వీరిద్దరి మధ్య అదిరిపోయే యాక్షన్‌ సీన్లని డిజైన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలయ్య సినిమాకి యాక్షన్‌ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే.

55
balakrishna

గతంలో `సింహా`ని మించి `లెజెండ్‌`లో, `లెజెండ్‌`ని మించి `అఖండ`లో చూపించారు బోయపాటి. ఇప్పుడు వాటిని మించి `అఖండ 2`లో చూపించబోతున్నారట. ఇక ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. 

read more: చిరంజీవి పిలిచి ఆఫర్‌ ఇస్తే నో చెప్పిన డైరెక్టర్‌, కట్‌ చేస్తే ఇద్దరి కాంబినేషన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

also read: Marriage Condition: సినిమా ప్లాప్‌ అయితే పెళ్లి, అక్షయ్‌ కుమార్‌ మ్యారేజ్‌ వెనుక ట్వింకిల్‌ ఖన్నా కండీషన్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories