HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్‌ రెడీ, పవన్‌పై షూట్‌ చేయాల్సింది ఎన్ని రోజులంటే?

Published : Feb 09, 2025, 08:36 PM IST

HHVM Surprise: పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. ఈ మూవీ ఫస్టాఫ్‌ వర్క్ కంప్లీట్‌ అయ్యిందట. పవన్‌ షూటింగ్‌ మిగిలి ఉందని తెలుస్తుంది.   

PREV
14
HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్‌ రెడీ, పవన్‌పై షూట్‌ చేయాల్సింది ఎన్ని రోజులంటే?

HariHara VeeraMallu Update: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని మొదట కంప్లీట్‌ చేయాలని పవన్‌ భావిస్తున్నారు. టీమ్‌ కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. అదేంటో చూస్తే. 
 

24

`హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ ఆల్మోస్ట్ కంప్లీట్‌ అయ్యిందట. కేవలం పవన్‌ కళ్యాణ్‌పై షూటింగ్‌ చేయాల్సి ఉందట. మరో నాలుగు రోజులు పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొంటే చిత్రీకరణ అయిపోతుందని తెలుస్తుంది. ఆయన డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారట. అయితే పవన్‌ కోసం షూటింగ్‌ ఆగిపోయింది, కానీ సినిమా వర్క్ నడుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా చేస్తున్నారట టీమ్‌. 
 

34

ఇప్పటికే ఫస్టాఫ్‌ ఎడిటింగ్‌ కూడా పూర్తయ్యిందట. మొదటి భాగాన్ని లాక్‌ చేసినట్టు తెలుస్తుంది. రెండో భాగానికి సంబంధించిన ఎడిటింగ్‌ కూడా జరుగుతుందని తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ డీఐ వర్క్ చేస్తున్నారని, శనివారంతోనే నాలుగు రోజుల షెడ్యూల్‌ ఒకటి పూర్తయ్యిందట. పవన్‌ సీన్లు తప్పితే మిగిలిన కంటెంట్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ నడుస్తుందట. జస్ట్ పవన్‌పై సీన్లు చిత్రీకరించి, వాటిని ఏ ఏ ప్లేస్‌లో పెట్టాలో మెర్జ్ చేయడమే మిగిలి ఉందని తెలుస్తుంది. టీమ్‌ మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నారని సమాచారం. 
 

44

అయితే సినిమాని మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు వాయిదా పడే అవకాశం ఉందని, ఏప్రిల్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌ బందిపోటు దొంగ వీరమల్లుగా నటిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్‌ ఔరంగాజేబ్‌గా కనిపిస్తారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హిస్టారికల్‌ పీరియడ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత అనే విషయం తెలిసిందే.  

read  more: Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్‌.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?

also read: చిరంజీవి పిలిచి ఆఫర్‌ ఇస్తే నో చెప్పిన డైరెక్టర్‌, కట్‌ చేస్తే ఇద్దరి కాంబినేషన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories