2021లో విడుదలైన పుష్ప మూవీ వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇది అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్. అప్పట్లో ఏపీలో టికెట్స్ ధరలు తక్కువగా ఉన్నాయి. లేకుంటే పుష్ప కలెక్షన్స్ ఫిగర్ ఇంకా మెరుగ్గా ఉండేది. పుష్ప హిందీ వెర్షన్ కి పెద్దగా ప్రచారం దక్కలేదు. ఈ కారణంగా ఓపెనింగ్స్ రాలేదు. ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్లు వసూలు చేసిన పుష్ప మూవీ.. పాజిటివ్ టాక్ తో పుంజుకుని రూ. 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది.
పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 కోసం ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి ఉన్న డిమాండ్ ఏమిటో ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే అర్థం అవుతుంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను నిర్మాతలు రూ. 1000 కోట్లకు అమ్మారు. మూవీ ఫలితంతో సంబంధం లేకుండా లాభాలు ఆర్జించారు. ప్రాఫిట్ లో షేర్ రెమ్యూనరేషన్ గా అడిగిన అల్లు అర్జున్ కి పుష్ప 2 ద్వారా రూ. 300 కోట్లు అందాయనే టాక్ ఉంది.