అనుష్క నిర్లక్ష్యమే పెద్ద శాపంగా మారిందా..? స్వీటి సినిమాలు ఎందుకు చేయడంలేదు..?

First Published | Nov 1, 2024, 11:41 PM IST

అనుష్క శెట్టి సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాని ఆమె మాత్రం పెద్దగా యాక్టీవ్ గా లేదు. అభిమానుల కోసం అయినా సినిమాలు చేయడం లేదు. కారణంఏంటో తెలుసా..? 

కాస్త లావుగా ఉందనే కాని.. ఇప్పటికీ గ్లామర్ విషయంలో ఏమత్రం తగ్గడంలేదు అనుష్క శెట్టి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ ను సాధించినఅనుష్క శెట్టి.. సినిమాలు చేయకపోవడం.. ఆమె అభిమానులకు మిగుడు పడటంలేదు. అంత మిర్చి, బాహుబలి, అరుంధతి, భాగమతి, నిశబ్ధం లాంటి సినిమాలు  అనుష్క కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్ళాయి.

Also Read: అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

కాని ఆతరువాత ఆమె చేసిన సైజ్ జీర్ సినిమా వల్ల అనుష్క కెరీర్ కు బ్రేక్ పడింది. ఈసినిమా కోసం బాగా లావయ్యింది స్వీటి. ఆతరువాత బరువు తగ్గొచ్చులే అనుకుంది. కాని ఎంత ప్రయత్నం చేసినా.. ఏం చేసినా లావు తగ్గలేకపోయింది. ఇదే ఆమె కెరీర్ కు పెద్దమైనస్ లా మారింది. ఆతరువాత ఎన్ని ఆఫర్లు వచ్చినా.. సినిమాలు చేయలేకపోయింది అనుష్క. 

Also Read: మెగా చీఫ్ గా అవినాష్.. గౌతమ్ కు మేటర్ లేదన్న నయని


Anushka Shetty

కొన్ని సినిమాల కోసం లావు తగ్గాలని ప్రయత్నించి విఫలం అయ్యింది. ఆమె అనుకుంటే చాలు కాని.. అనుష్క స్టార్ డమ్ ఇప్పటికీ అలానే ఉంది. రానా ,ప్రభాస్, గోపీచంద్ లాంటి సిక్స్ ఫీట్ హీరోలకు మంచి జోడీగా సరిపోతుంది అనుష్క. దాదాపు 43 ఏళ్ల వయస్సు వచ్చినా.. గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు స్వీటి. 

Also Read: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు

Anushka Shetty

కాని ఆమె కాస్త మనసు పెట్టి బరువు తగ్గితే మళ్లీ మంచి ఫామ్ లోకి రావడం పెద్ద విషయమేమి కాదు. త్రిష, నయనతార, దీపికాపదుకునే లాంటి తారలు 40 ఏళ్ళు దాటినా.. ఇంకా హీరోయిన్లు గా ఫామ్ ను కొనసాగిస్తుండటం తెలిసిందే. వారితో పోల్చుకుంటే అనుష్క స్టార్ డమ్ ఇంకాస్త పెద్దదే కాని తక్కువేమి కాదు. 

మరి స్టార్ హీరో కి ఉన్న రేంజ్ ఆమెకు ఉన్నప్పటికీ ఆమె ఎందుకు ఇలా సినిమాలను నెగ్లెట్ చేస్తుంది అనే విషయాల మీదనే సరైన అభిప్రాయం అయితే రావడం లేదు. నిజానికి అనుష్కలాంటి నటి చేత మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?

బరువును తగ్గించుకొని మళ్ళీ స్లిమ్ గా తయారైతే చాలా మంచి అవకాశాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆమె సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది. తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ప్రత్యేకించి కొన్ని క్యారెక్టర్ల కోసం బరువు తగ్గాల్సి వస్తే మాత్రం తగ్గలేకపోతుంది. 

కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని సంపాదించుకున్న అనుష్క... సినిమాలు చేయకపోవడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అభిమానుల కోసం అయినా అనుష్క మళ్లీ తెరపై కనిపించాలని కోరకుంటున్నారు. మరి ఆమె నిర్ణయం ఏముంటుందో ముందు ముందు చూడాలి. 

ఇక అనుష్క పెళ్లి గురించి కూడా రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. 43 ఏళ్ళు దాటినా.. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటీ అని ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ తో ప్రేమలో ఉందని.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదని వాదన కూడా వినిపించింది. అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరు ఇంకా పెళ్ళి చేసకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

Latest Videos

click me!