`సైంధవ్‌`కి బజ్‌ రావడం లేదు?.. సంక్రాంతి సందడి మిస్సింగ్‌.. వెంకీ చేసిన మిస్టేక్‌ అదేనా?

Published : Jan 09, 2024, 02:07 PM ISTUpdated : Jan 09, 2024, 03:34 PM IST

వెంకటేష్‌ నటించిన `సైంధవ్‌` సినిమా సంక్రాంతికి సందడి చేయబోతుంది. కానీ మూవీకి బజ్‌ రావడం లేదు. మరి మిస్టేక్‌ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.  

PREV
16
`సైంధవ్‌`కి బజ్‌ రావడం లేదు?.. సంక్రాంతి సందడి మిస్సింగ్‌.. వెంకీ చేసిన మిస్టేక్‌ అదేనా?

విక్టరీ వెంకటేష్‌.. ఫ్యామిలీ హీరో. ఆయన ఫ్యామిలీ ఎలిమెంట్లతో  కూడిన సినిమాలు చేసి పెద్ద విజయాలు అందుకున్నారు. విక్టరీ వెంకటేష్‌ అయ్యారు. మధ్య మధ్యలో యాక్షన్‌ మూవీస్‌ కూడా చేశాడు, విజయాలు అందుకున్నారు. కానీ వెంకీని నిలబెట్టింది, ఆయన్ని స్టార్‌ హీరోని చేసింది, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది మాత్రం ఫ్యామిలీ, లవ్‌ స్టోరీస్‌ లు మాత్రమే. ఇప్పటికీ ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో తిరుగులేని ఇమేజ్‌, క్రేజ్‌ ఉంటుంది. అదే వెంకీ బలం. 
 

26

ఇటీవల కాలంలో ఆయన కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. సరైన సినిమాలు పడటం లేదు. అయితే ఇప్పుడు యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది.దీంతో `సైంధవ్‌` అనే యాక్షన్‌ మూవీ చేశాడు. ఇది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. సినిమా కోసం ఆయన చాలా ప్రమోషన్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడని చెప్పొచ్చు. ఆయన చేస్తున్న ప్రమోషన్స్ కార్యక్రమాలు చూస్తే అదే అనిపిస్తుంది.
 

36

వెంకీనే స్వయంగా హాట్‌ కామెంట్స్ చేయడం, స్టేజ్‌పై డాన్సులు చేయడం, కాలేజీలు తిరగడం చేశాడు. ఇటీవల కాలంలో ఇంతటి అగ్రెసివ్‌గా ఆయన ప్రమోషన్స్ లో పాల్గొన్నది లేదు. అయినా ఈ సినిమాపై బజ్‌ రావడం లేదు. ఆడియెన్స్ లో హైప్‌ కనిపించడం లేదు. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.అయితే ఫ్యామిలీ ఎలిమెంట్లు లేవా? అంటే అసలు కథ అంతా కూతురు చుట్టూతే తిరుగుతుంది. కూతురు కోసం పోరాడుతుంటారు. వైఫ్‌ కూడా ఉంది. మరి ఎక్కడ మిస్టేక్‌ జరుగుతుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

46

అయితే వెంకీ అంతా చేశాడు, కానీ ఒక మిస్టేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రావడమే రాంగ్‌ ఛాయిస్‌ అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీ సందడి, ఆటా,పాట ఉండాలి. సరదాలు, సందడి, పండగ వాతావరణం కనిపించాలి. కానీ `సైంధవ్‌`లో ఆ ఎలిమెంట్లు మిస్సింగ్‌. సినిమా పూర్తిగా సీరియస్‌గా సాగుతుంది. పైగా భారీయాక్షన్‌ ఎలిమెంట్లు ఉన్నాయి. పండగ వాతావరణం కనిపించడం లేదు. ఈ కారణంగానే ఈ సినిమాకి హైప్‌ రావడం లేదంటున్నారు.
 

56

సంక్రాంతి పండగ అంటే ఆడియెన్స్ పండగ లాంటి సినిమాని కోరుకుంటారు. సినిమాలో అలాంటి ఎలిమెంట్లని కోరుకుంటారు. పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలనుకుంటారు. కానీ `సైంధవ్‌` సీరియస్‌ మూవీ దీంతో ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, అదే మిగ్‌ మైనస్‌ అని, సంక్రాంతి సందడిలో వెనుకబడుతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ వేరే రోజుల్లో వస్తే బాగుందనేది, సంక్రాంతి రిలీజ్‌ అనేది ఇక్కడ మ్యాటర్‌గా మారుతుందని విశ్లేషకులు, ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
 

66

అయితే ఈ మూవీని సురేష్‌ బాబు ప్రొడక్షన్‌ ఈ మూవీని రిలీజ్‌ చేస్తుంది. సంక్రాంతి పోటీలో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ, జనవరి 13న విడుదల అవుతుంది. థియేటర్ల పరంగా సమస్య లేదు. కానీ కంటెంట్‌ ఏమేరకు ఆడియెన్స్ కి రీచ్‌ అవుతుందనేది సస్పెన్స్. ఇక శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన `సైంధవ్‌` సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. సారా కూతురుగా కనిపిస్తుంది. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి సంక్రాంతి పోటీలో ఈ మూవీ నిలబడుతుందా? అనేది చూడాలి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories