కోట్లు ఏం చేసుకుంటావ్? నువ్వు పేదోడివా... బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై కుర్చీ తాత ఫైర్!

Published : Jan 09, 2024, 01:15 PM IST

బిగ్ బాస్ షోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వారిలో కుర్చీ తాత కూడా ఒకడు. తాజా ఇంటర్వ్యూలో కుర్చీ తాత హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ షో పై సీరియస్ కామెంట్స్ చేశాడు.   

PREV
17
కోట్లు ఏం చేసుకుంటావ్? నువ్వు పేదోడివా... బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై కుర్చీ తాత ఫైర్!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ షో అత్యంత ఆదరణ కలిగిన షో. అందులో పార్టిసిపేట్ చేసిన సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అయ్యారు. నెలల పాటు హౌస్లో కంటెస్టెంట్స్ మాట తీరు, ఆట తీరు చూసి అభిమానులు తయారవుతారు. మూడు నెలల పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. 

 

27
Nagarjuna

జనాలు టీవీలకు అతుక్కుపోయేలా బిగ్ బాస్ షో ఉంటుంది. అదే సమయంలో ఓ వర్గం బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయవాదులు షో నిలిపివేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కొందరు కేసులు కూడా వేశారు. 
 

37
Nagarjuna


సిపిఐ నారాయణ పలుమార్లు బిగ్ బాస్ షోపై ధ్వజమెత్తారు. బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ తో పోల్చాడు. ఆ హౌస్లో నుండి బయటకు వచ్చి పతివ్రత అంటే నమ్మను అంటూ దారుణమైన ఆరోపణలు చేశాడు. నాగార్జున డబ్బులకు కక్కుర్తి పడి బిగ్ బాస్ షో చేస్తున్నాడని ఆరోపించాడు. 


 

47

కుర్చీ తాత సైతం బిగ్ బాస్ షోపై మండిపడ్డాడు. నాగార్జున మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టిన కుర్చీ తాత, నాగార్జునను బిచ్చం ఎత్తుకుంటున్నావా? అని నేరుగా అడిగాడు. 

57
Kurchi Thatha

నాగార్జున పేదవాడు కాదు. ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు. ఆయన భార్య అమల కూడా సంపాదిస్తుంది. కోట్లు ఏం చేసుకుంటాడు. నేను బిగ్ బాస్ షో వద్దకు పోతే రాళ్లతో కొడతాను, అన్నాడు. ఇంత ఆస్తి ఉంది ఏం చేసుకుంటావ్ అన్నాడు. 

 

67

నాగార్జునను ఉద్దేశించి కుర్చీ తాత గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన కుర్చీ తాత ఒక్క డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. గతంలో కుర్చీ తాత పవన్ కళ్యాణ్, కేటీఆర్ వంటి రాజకీయ నాయకులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 

 

77

కాగా కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ ని గుంటూరు కారం మూవీ సాంగ్ లో వాడటం విశేషం. ఇటీవల విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ సాంగ్ లో తన డైలాగ్ లో వాడినందుకు లక్ష రూపాయలు ఇచ్చారని కుర్చీ తాత చెప్పాడు. 

click me!

Recommended Stories