Naga Panchami 9th January Episode:ఫణీంద్ర మోసం బయటపెట్టిన నాగ సాధువు.. పంచమి ఏం చేస్తుంది..?

Published : Jan 09, 2024, 01:03 PM IST

 నాగమణి కాకుండా, నాగకాంత మొక్క తెస్తే. బతికించలేమా అని పంచమి అడుగుతుంది. ఏది తేవాలి అన్నా.. మీరు కాటు వేయాల్సిందే యువరాణి అని ఫణీంద్ర చెబుతాడు. అయితే.. ఎక్కడ చేయాలి అనే విషయం మాత్రం డిసైడ్ అవ్వమంటాడు.

PREV
16
Naga Panchami 9th January Episode:ఫణీంద్ర మోసం బయటపెట్టిన నాగ సాధువు.. పంచమి ఏం చేస్తుంది..?
Naga panchami

Naga Panchami 9th January Episode:గత ఎపిసోడ్ లో పంచమి పాముగా మారుతుంది. చావడానికి మెక్ష కూడా సిద్ధపడతాడు. తనను చంపేయమని బెడ్ మీద పడుకుంటాడు. కానీ, పంచమి కాటు వేయలేకపోతుంది.  కనీసం ఫణీంద్రను అయినా కాటు వేయమని మోక్ష అడుగుతాడు. కానీ, పంచమి వద్దు అని వేడుకుంటుంది. కానీ, ఫణీంద్ర... తాను కాటు వేయకూడదని, కేవలం పంచమి మాత్రమే కాటు వేయాలని, అప్పుడే  నాగలోకంలోకి అడుగుపెట్టడానికి, తర్వత.. నాగమణి తీసుకురావడానికి వీలుపడుతుందని చెబుతాడు. కానీ.. పంచమి చంపడానికి అంగీకరించదు. ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు ఫణీంద్ర నాగమణి తెస్తే.. దానిని తాను దక్కించుకోవచ్చు అని మేఘన అనుకుంటూ ఉంటుంది.

26
Naga panchami

ఈ లోగా.. ఫణీంద్ర ట్విస్ట్ ఇస్తాడు.  ఈ ఇంట్లో పంచమి బలవంతంగా మోక్షను కాటు వేసినా.. మోక్ష అరుపు వినపడి అందరూ వచ్చేస్తారని, అప్పుడు మళ్లీ మనం మోక్షను కాపాడలేం అని , ఇక్కడ కాకుండా, మరెక్కడైనా దీనికి ఏర్పాటు చేద్దాం అని ఫణీంద్ర సలహా ఇస్తాడు. ఇక్కడ మాత్రం వద్దంటే వద్దు అంటాడు. అయితే..  నాగమణి కాకుండా, నాగకాంత మొక్క తెస్తే. బతికించలేమా అని పంచమి అడుగుతుంది. ఏది తేవాలి అన్నా.. మీరు కాటు వేయాల్సిందే యువరాణి అని ఫణీంద్ర చెబుతాడు. అయితే.. ఎక్కడ చేయాలి అనే విషయం మాత్రం డిసైడ్ అవ్వమంటాడు.

అయితే, తమ ఊరి కొండల్లో నాగసాధువు ఉన్నాడని, వారి ఆశ్రమంలో అయితే.. ఎవరికీ అనుమానం రాదని, మనం తిరిగి వచ్చే వరకు ఆయన అయితే..మోక్షను జాగ్రత్తగా చూసుకుంటాడని పంచమి అంటుంది. దానికి అందరూ సరే అంటారు. మేఘన తాను ఇక్కడే ఉంటానని.. రేపటికి అక్కడికి వస్తాను అని చెబుతుంది. మోక్ష, పంచమిని రమ్మని చెప్పి.. ఫణీంద్ర పాములా మారి బయలుదేరి వెళ్లిపోతాడు.  మేఘన వెళ్లేముందు.. నాగమణి కోసం ప్రయత్నించమని చెబుతుంది. అయితే.. పంచమి.. నాగాసాధువు ఏం చెబుతారో చూద్దాం అని అంటుంది. వీళ్లు బయటకు వెళ్లడానికి తర్వాత మేఘన తలుపు తీస్తుంది. వాళ్లు.. వెళ్లిపోతారు.

36
Naga panchami


పంచమి నాగమణి తెచ్చేలా కనపడటం లేదని, వాళ్లను నమ్మకుండా.. తన ప్రయత్నం తాను చేయాలి అని మేఘన మనసులో అనుకుంటుంది. తర్వాత.. ఫణీంద్ర పంచమిని మోసం చేసి నాగమణి తీసుకురాకపోతే.. ఇక్కడ మోక్ష చనిపోతాడని, అక్కడ నుంచి నాగమణి కూడా రాదని.. అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అని  మేఘన ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత.. తాను కూడా వాళ్లతో ఉంటేనే.. వాళ్ల ఆలోచనలు తెలుస్తాయని.. ముందు ఈ ఇంటి నుంచి  బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది.

మరోవైపు... వైదేహి వాళ్లు.. మోక్ష కోసం టెన్షన్ పడుతూ ఉంటారు.అదే ఛాన్స్ గా భావించి తాను పంచమిని వెతకడానికి వెళతాను అని, పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది. నువ్వు మంచిదానివి కాబట్టి పర్మిషన్ అడుగుతున్నావంటూ.. వైదేహి.. మేఘనను మెచ్చుకుంటుంది. మేఘన వెళ్లిన తర్వాత.. వైదేహి మేఘనను పొగుడుతూ.. పంచమిని తిడుతుంది. దానికి మోక్ష తండ్రి వ్యతిరేకిస్తాడు. దీంతో.. వైదేహికి కోపం వస్తుంది.
 

46
Naga panchami

మేఘన బయటకి వెళ్లినందుకు చిత్ర, జ్వాల సంతోషిస్తారు.  మేఘన లేని సమయంలో ఆమె గదిలోకి దూరి.. ఏమైనా మంత్రాలకు సంబంధించనవి దొరుకుతాయేమో అని ప్రయత్నిస్తారు.వాళ్లకు ఏదో మూట దొరుకుతుంది. వాళ్లకు మూట దొరికే సమయానికి ఆ విషయం మేఘనకు తెలిసిపోతుంది. మంత్రాలు జపిస్తుంది. దాంతో.. మేఘన తన శక్తితో జ్వాలకు దెయ్యం పట్టేలా చేస్తుంది. దెయ్యం పట్టిన జ్వాల.. చిత్రకు చుక్కలు చూపిస్తుంది. తర్వాత మళ్లీ చిత్ర వంతు వస్తుంది. ఈసారి దెయ్యం.. చిత్రకు పడుతుంది. ఈ సారి చిత్ర..జ్వాలకు చుక్కలు చూపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా చేస్తుంది. తర్వాత మేఘన వెళ్లిపోతుంది. చిత్ర, జ్వాల మాత్రం ఏం జరిగిందో అర్థం కాక.. ఒకరిని చూసి మరొకరు భయపడిపోతూ ఉంటారు. బుద్ది తక్కువై.. ఈ గదిలోకి వచ్చాం అని అక్కడి నుంచి పారిపోతారు.

మరోవైపు పంచమి, మోక్షలు నాగ సాధువు ఉండే గుడికి చేరుకుంటారు. ఫణీంద్ర ను కూడా మామూలు మనిషిలా  మారి అక్కడకు వస్తారు. సుబ్రహ్మణ్య స్వామి అండ ఉంటే.. అన్ని కార్యాలు సక్రమంగా జరుగుతాయని పంచమి అంటుంది. అయితే.. ముందు తనను నమ్మమని ఫనీంద్ర అడుగుతాడు. నిన్ను నమ్మాం కాబట్టే.. ఇక్కడకు వచ్చాం అని పంచమి చెబుతుంది. కానీ, తనకు సుబ్రహ్మణ్య స్వామి తోడు కావాలి అని అంటుంది. తనకు అయితే.. ఎలాంటి ఆశలు లేవని, ఆ స్వామిని నాకంటే.. నీకోసం వేడుకోమని మోక్ష అడుగుతాడు. దేవుడు.. మనకు అన్యాయం చేయడని పంచమి అంటుంది. నీకు మంచి జరిగితే... నాకు జరిగినట్లే అని మోక్ష అంటాడు.

56
Naga panchami

పంచమి లేని సమయంలో... ఫణీంద్రతో మోక్ష మాట్లాడతాడు. తనకు ఏం జరిగినా పర్వాలేదని.. పంచమికి మాత్రం ఎలాంటి కష్టం రాకూడదని అంటాడు. ఫణీంద్ర మనసులో తన దుర్బుద్ధి తెలుపుతాడు. నువ్వు తిరిగి బతకవని,  నేటితో పంచమి మా నాగలోక యువరాణి అవుతుందని, తనకు కాబోయే పట్టపురాణి అవుతుందని అనుకుంటూ ఉంటాడు. మోక్ష మాత్రం..  పంచమి తన కోసం చాలా కష్టపడుతుందని, ఇక తనకు ఆ కష్టాలు చాలని అంటాడు. ఒకవేళ మీరు నన్ను బతికిస్తే.. పంచమిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెబుతాడు. మనసులో చాలా కుట్ర ఉన్నా... బయటకు మాత్రం.. భయపడొద్దని, ఏం జరగాలని ఉంటే అది జరుగుతుందని  ఫణీంద్ర మోక్షతో అంటాడు.

మరోవైపు పంచమి.. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ ఉంటుంది. ‘ స్వామి నేను ఫణీంద్రను నమ్మి నా భర్త ప్రాణాలను పణంగా పెడుతున్నా, అతను ఏ మాత్రం మోసం చేసినా.. నా భర్త ప్రాణాలు పోతాయి. మోక్ష బాబుని కాపాడుకోలేకపోతే నేను ప్రాణాలతో ఉండి అనవసరం. నాకు నువ్వే అండగా ఉండాలి స్వామి. నా కష్టంలో పడి మిమ్మల్ని నేను పూజించకపోయినా.. నా చెయ్యి విడవకండి. మిమ్మల్ని నమ్ముకొని వెళ్తున్నాను’ అని పంచమి అంటుంది. అప్పుడే బాలుడి రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఇస్తాడు.
 

66
Naga panchami

పంచమి అని పిలుస్తాడు. కానీ.. పంచమి వెతికే సరికి సుబ్బు కనిపించడు. మళ్లీ వెతికేసరికి కనిపిస్తాడు. పరుగున వెళ్లి.. సుబ్బూని పట్టుకుంటుంది పంచమి. కానీ.. అదృశ్యమౌతాడు. దీంతో.. సుబ్బూ.. అని వెతుకుతూ ఉంటుంది.  మళ్లీ కనిపించి పంచమి అని పిలుస్తాడు.  ఈసారి కూడా అదృశ్యమౌతాడు. పంచమితో దాగుడుమూతలు ఆడతాడు. కనిపిస్తాడు.. వెంటనే అదృశ్యమౌతాడు. ఏం జరుగుతుందో పంచమికి అర్థం కాదు. అది తన భ్రమ అని అనుకుంటుంది. సుబ్బూ లేని లోటు తనకు బాగా తెలుస్తోందని, సుబ్బుని చూడాలని ఉందని, ఒక్కసారి కనిపిస్తే బాగుండు అని అనుకుంటుంది. ఒక్కసారి కనిపించు సుబ్బూ.. అని ఏడుస్తుంది. ఎలా అయినా నా భర్తను కాపాడుకోవాలని.. అలా చేసినప్పుడే తన జన్మ కు ఓ అర్థం ఉంటుంది అని పంచమి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మళ్లీ నిన్ను చూడగలనో లేదో అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగ్ అప్ లో... నాగసాధువు పంచమి, మోక్షలతో మాట్లాడతాడు. నాగమణి తీసుకురావడం అంత సులభం కాదని, కేవలం నాగచంద్ర కాంత అనే మొక్క తెస్తే చాలు అని చెబుతాడు. అదొక్కటే నాగు కాటుకు విరుగుడు అని చెబుతాడు.


 

click me!

Recommended Stories