తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తున్న ఈ బ్యూటీ సౌత్ ఆడియెన్స్ కు ఇప్పుడిప్పుడే బాగా దగ్గరవుతోంది. హీరోయిన్ గానూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తన ప్రతి సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉండేలా, కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతోంది.