సోల్‌మేట్ కోసం వెతికాను, కానీ.. ప్రేమ, పెళ్లిపై నిత్యా మీనన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. ఆ అనుభవంతో పెళ్లికి దూరం ?

Published : Jul 23, 2025, 02:44 PM IST

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన నిత్యా మీనన్‌ తాజాగా ప్రేమ, పెళ్లిపై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. లవ్‌ బ్రేకప్‌ కి సంబంధించిన అనుభవాలను పంచుకుంది. 

PREV
15
హీరోయిన్‌ లెక్కలు మార్చేసిన నిత్యా మీనన్‌

నిత్యా మీనన్‌ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. వరుసగా మంచి హిట్‌ చిత్రాల్లో భాగమయ్యింది. తనదైన అద్బుతమైన నటనతో మెప్పించింది. 

హీరోయిన్ల విషయంలో హైట్‌, జీరో సైజ్‌ అనే పారామీటర్స్‌ తో సంబంధం లేకుండా సినిమాల్లో రాణించవచ్చు, స్టార్‌ హీరోయిన్‌గా ఎదగవచ్చు అని నిరూపించింది నిత్యా మీనన్‌. కానీ ప్రస్తుతం ఆమె తెలుగుకి దూరంగా ఉంటోంది.

25
మ్యారేజ్‌పై నిత్యా మీనన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది నిత్యా మీనన్‌. చాలా వరకు తమిళం, మలయాళంలోనే మూవీస్‌ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె విజయ్‌ సేతుపతితో కలిసి `సార్‌ మేడమ్‌` అనే తమిళ మూవీలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 25న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

 తెలుగులోనూ దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యా మీనన్‌ తాజాగా చిత్రప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జీవితంలోని అనుభవాలతో మ్యారేజ్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

35
ప్రేమకు ప్రయారిటీ ఇవ్వడం లేదంటూ నిత్యా మీనన్‌ కామెంట్‌

ప్రేమ గురించి చాలా ఏళ్ల క్రితం ఆలోచించిందట. ఇప్పుడు దానికి తన జీవితంలో ప్రయారిటీ ఇవ్వడం లేదని, తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా మనకు జీవితంలో సోల్‌ మేట్‌ ఉండటం తప్పనిసరి అని గతంలో అనిపించిందని, 

అలా సోల్ మేట్‌ని వెతికిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలిపింది నిత్యా మీనన్‌. అయితే ఈ జర్నీలో తనలో చాలా మార్పు వచ్చిందని, వేరే రకంగానూ లైఫ్‌ ని ఎంజాయ్‌ చేయవచ్చని అర్థం చేసుకున్నట్టు చెప్పింది.

45
జీవితంలోని అనుభవాల కారణంగానే ఈ స్థితిలో ఉన్నా

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమించిన వ్యక్తినే లైఫ్‌ పార్టనర్‌గా చేసుకోవడం సాధ్యం కాదు అని, రతన్‌ టాటా కూడా వివాహం చేసుకోలేదని, పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని, అది జరిగినా, జరగకపోయినా మార్పు ఉండదని చెప్పింది. 

అయితే కొన్నిసార్లు తోడు లేనందుకు బాధ కలిగించినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందించాలని వెల్లడించింది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని,

 ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలని తెలిపింది నిత్యా మీనన్‌. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాను లవ్ బ్రేకప్‌ కారణంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అనేది ఆశ్చర్యంగా మారింది. 

55
ఆ హీరోతో నిత్యా మీనన్‌ లవ్‌ బ్రేకప్‌ ?

నిత్యా మీనన్‌తో గతంలో ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్టు, ఆయన్ని పెళ్లిచేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. 

ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే అది బ్రేకప్‌ అయ్యిందని, దీంతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమవుతోంది. 

ఇక నిత్యా మీనన్‌ `అలా మొదలైంది` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టి ఆకర్షించింది. `ఇష్క్` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.

 `జబర్దస్త్`, `గుండెజారి గల్లంతయ్యిందే`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `రుద్రమదేవి`, `జనతా గ్యారేజ్‌`, `అ`, `భీమ్లా నాయక్‌` వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకుంది. 

`భీమ్లా నాయక్‌` తర్వాత ఆమె తెలుగుకి దూరమయ్యింది. అటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఓటీటీ మూవీస్‌ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది నిత్యా మీనన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories