తాజాగా నిత్యా మీనన్ నటించిన మలయాళ చిత్రం ‘వండర్ విమెన్’ (Wonder Women). ఆరుగురు గర్భిణీ స్త్రీలు ప్రీ-నేటల్ ట్యూటర్ మార్గదర్శకత్వంలో మాతృత్వాన్ని పొందుతారు. ఇందులో నిత్యాకూడా ‘నోరా’అనే గర్భిణీగా నటించింది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే గతనెలలో అలా పోస్టు చేసినట్టు తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈరోజు మూవీ ప్రేక్షకుల ముందుకు రావడంతో తనకు ప్రెగ్నెన్సీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది.