`యశోద` సక్సెస్‌పై స్పందించిన సమంత.. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ భావోద్వేగ సందేశం..

Published : Nov 18, 2022, 06:38 PM IST

సమంత నటించిన `యశోద` చిత్రం థియేటర్లలో పాజిటివ్‌ టాక్‌ తో రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ సమంత ఓ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది.   

PREV
15
`యశోద` సక్సెస్‌పై స్పందించిన సమంత.. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ భావోద్వేగ సందేశం..

సమంత(Samantha) నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `యశోద`(Yashoda) గత శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. సమంత నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. అన్ని ఏరియాల నుంచి సినిమాకి పాజిటివ్‌ టాక్ రావడంతో సమంత `యశోద` ఫలితంపై స్పందించింది. ఈ మేరకు ఆమె ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. 
 

25

సోషల్‌ మీడియా ద్వారా సామ్‌ ఓ థ్యాంక్స్ నోట్‌ని షేర్‌ చేసింది. ``యశోద` సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకి, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు లభించిన గొప్ప గిఫ్ట్ గా భావిస్తున్నా. `యశోద` సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశా. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. ఇంతటి ఆదరణ వెనక మా సినిమా టీమ్‌ అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది.
 

35

ఇప్పుడు నా మనసు గాల్లో తేలున్నట్టుగా ఉంది. `యశోద` మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్లకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. నన్ను నమ్మి, ఈ సినిమాకి నన్ను తీసుకున్న నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి సినిమాని అందించిన దర్శకులు హరి, హరీష్‌లకు థ్యాంక్స్. ఈ కథ కోసం సెర్చ్ చేశారు. వారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. 
 

45

నాతోపాటు ఈ సినిమాలో నటించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అందరికి వినయ పూర్వక కృతజ్ఞతలతో మీ సమంత` అని పేర్కొంది సామ్‌. ప్రస్తుతం సమంత థ్యాంక్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లుకొడుతుంది. 
 

55

సమంత మెయిన్‌ లీడ్‌గా నటించిన `యశోద` చిత్రం వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సాధించింది. సోమవారం నుంచి సగానికి పడిపోయాయి. దీనికితోడు సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం సినిమాపై ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ స్టేబుల్‌ అవుతుంది. అయితేశుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజ్‌ కావడంతో అది `యశోద`పై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. మరి దాన్ని దాటుకుని యశోద నిలబడుతుందా అనేది చూడాలి. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే నిర్మాతకి టేబుల్‌ ప్రాఫిట్‌ కావడం విశేషం. థియేట్రికల్‌ రైట్స్ కి సంబంధించిన కలెక్షన్లు వస్తే అంతా సేఫ్‌లో ఉన్నట్టే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories