ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. ఇన్నాళ్ల బ్రహ్యచర్యానికి స్వస్తి పలుకుతూ నితిన్ వివాహం ఈనెల 26 వ తేదీన గ్రాండ్ గా జరిగింది. తన స్నేహితురాలు షాలినిని నితిన్ వివాహం చేసుకున్నారు.అతిథులు పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
undefined
పెళ్లికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయనేతలు కూడా హాజరయ్యారు.
undefined
జూలై 26 వ తేదీ రాత్రి 8.30 గంటలకు, తాజ్ ఫలక్ నుమా హోటల్ వేదికగా, ఈ జంట ఒకటి అయ్యింది. ఈ వివాహానికి అతి కొద్ది మందే హాజరయ్యారు.
undefined
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం సాగిందని ఇప్పటికే నితిన్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. పరిమిత సంఖ్యలో వధూవరుల కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారని తెలుస్తోంది.
undefined
భీష్మా సినిమా రిలీజ్ తరువాత వీరి వివాహం జరగాల్సి ఉన్నది. కానీ, లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో నితిన్ వివాహం రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. అయితే, కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేకపోవటంతో ఈ వివాహ నిర్ణయం తీసుకున్నారు.
undefined
నితిన్ పెళ్లికి హాజరైన యువ హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు ఉన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెళ్లికి హాజరయ్యారు. నవదంపతులకు ఆయన దీవెనలు అందించారు.
undefined
నితిన్ ఎంగేజ్ మెంట్ కొన్నిరోజుల కిందట షాలినితో హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా నితిన్ ను పెళ్లికొడుకుగా చేసే నలుగు కార్యక్రమానికి పవన్ తన సన్నిహితులైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు (ఎస్.రాధాకృష్ణ)లతో కలిసి హాజరయ్యారు.
undefined
"నా హృదయపు లోతుల్లోంచి మా పవర్ స్టార్ కు వేలవేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. నన్ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమానికి వచ్చి నన్ను దీవించినందుకు ఆనందంగా ఉంది. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది" అంటూ నితిన్ ట్వీట్ చేశారు.
undefined