అందుకే `ఆర్‌ఆర్‌ఆర్‌` టెస్ట్ షూట్‌ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్‌

First Published | Jul 26, 2020, 1:02 PM IST

లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు తిరిగి అనుమతి ఇవ్వటంతో ఆర్ ఆర్‌ ఆర్‌ ట్రయల్‌ షూట్‌ చేయాలని భావించారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్న ట్రయల్‌ షూట్ చేయకపోవటంతో అనుమానాలు కలిగాయి.

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి స్థాయిలో భారీ బడ్జెట్‌తో బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తికాగా గత మూడు నెలలుగా షూటింగ్ ఒక్క అడుగు కూడా పడలేదు.
undefined
ఇటీవల లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు తిరిగి అనుమతి ఇవ్వటంతో ఆర్ ఆర్‌ ఆర్‌ ట్రయల్‌ షూట్‌ చేయాలని భావించారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్న ట్రయల్‌ షూట్ చేయకపోవటంతో అనుమానాలు కలిగాయి. ఈ విషయంపై చిత్ర సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ క్లారిటీ ఇచ్చాడు. లాక్‌ డౌన్‌ ముందు వరకు దాదాపు 500 మంది క్రూతో షూటింగ్ జరిగింది.
undefined
Tap to resize

ఇప్పుడు సడన్‌గా ఆ సంఖ్యను 50కి తగ్గించటం అంటే చాలా పెద్ద ఛాలెంజ్‌. అయితే అది సాధ్యమేనా అని టెస్ట్ షూట్ చేయాలని భావించాం. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సామాజిక బాధ్యతతో షూటింగ్ చేయలేదు. ప్రస్తుతం తక్కువ మందితో షూటింగ్ ఎలా చేయగలం అన్న విషయం ఆలోచిస్తున్నాం..? అని సెంథిల్ తెలిపారు.
undefined
ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ నటిస్తోంది.
undefined

Latest Videos

click me!