సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద పవన్ అభిమానుల దాడి కొనసాగుతోంది. లాక్ డౌన్ సమయంలో వర్మ మరిన్ని వివాదాలకు తెర తీశాడు. పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా పవర్ స్టార్ సినిమాను రూపొందించాడు వర్మ. దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా వర్మ చేసే ట్వీట్లు వివాదాలకు కారణమైంది. సహనం కోల్పోయిన పవన్ అభిమానులు ఏకంగా వర్మ ఆఫీస్ మీద దాడి చేశారు. అయితే ఈ వివాదాన్ని కూడా తన సినిమా పబ్లిసిటీకి వాడేసుకున్నాడు వర్మ.
undefined
అదే సమయంలో వర్మకు వ్యతిరేకంగా సినిమాలు రూపొందించారు పవన్ అభిమానులు. చాలా రోజుల క్రితమే గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆర్ జీ వీ (రోజూ గిల్లేవాడు ) పేరుతో ఓ సినిమాను ప్రకటించాడు. తాజాగా పవన్ అభిమానులు పవర్ స్టార్‌కు వ్యతిరేకంగా ఏకంగా పరాన్నజీవి సినిమాను రూపొందించి రిలీజ్ చేశారు. డేరాబాబా పేరుతో మరో సినిమా కూడా రూపొందుతోంది. ఈ సినిమాలో కూడా షకలక శంకరే ఆర్జీవీగా కనిపించున్నాడు.
undefined
తాజాగా ఆర్జీవీపై సెటైరికల్‌గా తెరకెక్కుతున్న మరో సినిమా మోషన్ టీజర్ రిలీజ్ అయ్యింది. `ఎవడ్రా నన్ను కొట్టింది` అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఒంటినిండా గాయాలతో ఉన్న కట్లతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వర్మ, పక్కన శ్రీదేవి, హిచ్‌కాక్‌ల ఫోటోలతో ఇంట్రస్టింగ్‌గా డిజైన్ చేశారు. తనను కొట్టింది ఎవరో తెలియక ఆరునెలల పాటు ఆర్జీవీ పడే వేదనే ఈ సినిమా కథ అని వెల్లడించారు చిత్రయూనిట్.
undefined
సినీ లవర్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నీలకంఠం దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఈ సినిమాలో షూటింగ్ ప్రారంభించామని వెల్లడించారు చిత్రయూనిట్. ఇన్నాళ్లు ప్రతీ ఒక్కళ్లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద చిత్రాలను రూపొందించిన వర్మ, ఇప్పుడు తానే ఓ వివాదాస్పద సినిమాలకు సబ్జెక్ట్‌గా మారాడంటున్నారు హేటర్స్.
undefined