తమ్ముడు టైటిల్ నాకు ఇష్టం లేదు.. ట్రోలింగ్ కి భయపడిన నితిన్

Published : Jun 28, 2025, 01:24 PM IST

నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు జూలై 4న రిలీజ్ కి రెడీ అవుతోంది. తమ్ముడు చిత్ర టైటిల్ పై లేటెస్ట్ ఇంటర్వ్యూలో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
15

నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు జూలై 4న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అయితే తమ్ముడు చిత్ర టైటిల్ పై లేటెస్ట్ ఇంటర్వ్యూలో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

25

తమ్ముడు టైటిల్‌పై మొదట్లో తానేమీ సంతోషంగా లేను అని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నితిన్, ఈ టైటిల్‌ను విని మొదట తనకు భయం వేసిందని వెల్లడించారు. "నిజం చెప్పాలంటే, తమ్ముడు అనే టైటిల్ వింటేనే ఒక టెన్షన్ వచ్చింది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి 1999లో వచ్చిన కల్ట్ క్లాసిక్. నేను ఆయనకి ఫ్యాన్. అలాంటి టైటిల్‌ను మళ్లీ వాడితే ట్రోలింగ్ వస్తుందేమో అనే భయం కలిగింది," అని నితిన్ వెల్లడించారు.

35

అయితే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం ఈ కథకు తమ్ముడు అనే టైటిల్ యాప్ట్ అని తనని కన్విన్స్ చేసినట్లు నితిన్ తెలిపారు. దీనితో తమ్ముడు టైటిల్ కి ఒకే చెప్పినట్లు నితిన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ రెగ్యులర్ గా ఉండదు. చాలా కొత్తగా ఉంటుందని నితిన్ తెలిపారు. 

45

1999లో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా యూత్‌లో ఎంతటి ప్రభావం చూపించిందో తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లోనూ, పరిశ్రమవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కొత్త తమ్ముడు కథ ఎలా ఉంటుందో, నితిన్ ప్రదర్శన ఎలా ఉంటుందోనన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.

55

నితిన్ వరుస ఫ్లాపుల తర్వాత తమ్ముడు చిత్రంతో వస్తున్నారు. నితిన్ పరాజయాలకు బ్రేక్ పడాలంటే తమ్ముడు మూవీ హిట్ కావాలి. అయితే చిత్ర యూనిట్ ముందు నుంచి తమ్ముడు చిత్రంపై లోబజ్ మైంటైన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు అనవసరమైన హైప్ వద్దని అనుకుంటున్నారు ఏమో. 

Read more Photos on
click me!

Recommended Stories