నితిన్ కొత్త సినిమాలో పవన్ రీమిక్స్ సాంగ్, ఏ పాటంటే...?

Published : Jul 21, 2024, 07:11 AM IST

నితిన్ కెరీర్ గత కొంతకాలంగా అంత ఆశాజనంగా లేదు. దాంతో మరోసారి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆశ్రయిస్తున్నాడు.

PREV
18
నితిన్ కొత్త  సినిమాలో పవన్ రీమిక్స్ సాంగ్,  ఏ పాటంటే...?
Pawan Kalyan, nithin


పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత పిచ్చో మనకు తెలుసు. ఈ  వీరాభిమాని ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తూంటారు. తను ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు  ఇష్క్ పంక్షన్ కి... పవన్ ని అతిధిగా ఆహ్వానించిన నితిన్ ఆ సినిమాతో ఫామ్ లోకి వచ్చేసారు. అక్కడ నుంచి తన సినిమాకు పవన్ టచ్ అవసరం అని భావిస్తున్నారు. ఆ క్రమంలో  పవన్ పాటనే తన కొత్త సినిమాలో రీమిక్స్ చేస్తూ వస్తున్నాడు. పవన్ అభిమానులకు తమ అభిమాన హీరో పాట తెరపై మరోసారి వినటం అనేది ఎప్పుడూ ఆనందమే. అదే వర్కవుట్ అవుతూ వస్తోంది. 

28


అప్పట్లో తొలిప్రేమ చిత్రంలోని...ఏమైందో ఏమో ఈవేళ సాంగ్ ని రీమిక్స్ చేసాడు. ఆ సినిమాలో ఈ పాటే హైలెట్ అయ్యింది. అయితే  ఇలా రీమిక్స్  పాటలను ఎంచుకోవటం ఓ ఛాలెంజ్ . కానీ ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా,అందరూ మెచ్చుకునేలా రీమిక్స్ చేయాలి. ఆ  చిత్రం టైటిల్ 'గుండె జారి గల్లంతయ్యిందే' . ఈ టైటిల్ కూడా పవన్ గబ్బర్ సింగ్ లోని ఓ పాట చరణం నుంచి ప్రేరణ పొంది పెట్టుకున్నదే కావటం విశేషం.
 

38
Pawan Kalyan


నితిన్, నిత్యా మీనన్ జంటగా 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఎంత పెద్ద హిట్టైందో  సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సుధాకర్ రెడ్డి నిర్మాత. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, పవన్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్‌ సింగ్' చిత్రంలోని ఓ పాటలోని లిరిక్ అయిన 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఈ సినిమా చేసాడు.

48
Pawan Kalyan

నితిన్ కెరీర్ గత కొంతకాలంగా అంత ఆశాజనంగా లేదు. దాంతో మరోసారి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆశ్రయిస్తున్నాడు. పవన్ తో వకీల్ సాబ్ సినిమా తీసి హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోనూ ఓ రీమిక్స్ సాంగ్ పెడుతున్నట్లు వినికిడి. 

58
Pawan Kalyan

ఈ సినిమా కోసం నితిన్ పవన్ కళ్యాణ్ టైటిల్ నే కాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అయిన ఖుషి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అయిన ‘అమ్మాయే సన్నగా ‘అనే సాంగ్ ని కూడా రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

68
Pawan Kalyan

 హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం  సినిమాతో రాగా ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.  ఆ తర్వాత నితిన్ వక్కంతం వంశీ  దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా చేసినా కలిసి రాలేదు. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది.

78
Pawan Kalyan


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కంబ్యాక్ సినిమా వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘తమ్ముడు’ అని పెట్టడం విశేషం.  దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

88
Pawan Kalyan


 తమ్ముడు  సినిమా గురించి, టైటిల్ గురించి నితిన్ తన ట్విట్టర్ లో.. కొన్ని టైటిల్స్ రెస్పాన్సిబిలిటితో కూడా అటాచ్ అయి ఉంటాయి. మీ అంచనాలని నేను ఈ సినిమాతో అందుకుంటాను అని ట్వీట్ చేశాడు. దీంతో నితిన్ కొత్త సినిమా అనౌన్స్ వైరల్ మారింది. నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అని అందరికి తెలిసిందే. తన చాలా సినిమాల్లో పవన్ రిఫరెన్స్ లు వాడుకున్నాడు. నితిన్ ఈవెంట్స్ కి పవన్ కూడా గెస్టుగా వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు పవన్ టైటిల్ తో సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories