జూనియర్ ఎన్టీఆర్ కోసం ముగ్గురు స్టార్ హీరోలు చేసిన సాయం తెలుసా..తారక్ ఆ రుణం ఎలా తీర్చుకున్నాడంటే..

Published : Jul 20, 2024, 09:41 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవర చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది.

PREV
16
జూనియర్ ఎన్టీఆర్ కోసం ముగ్గురు స్టార్ హీరోలు చేసిన సాయం తెలుసా..తారక్ ఆ రుణం ఎలా తీర్చుకున్నాడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవర చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్టీఆర్, కొరటాల కెరీర్ లోనే దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ అదరగోట్టాయి. 

26

చాలా మంది హీరోలకి కెరీర్ లో కొన్ని అరుదైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఎన్టీఆర్ కి అలా ఓ చిత్రంతో మరచిపోలేని అనుభూతి ఉంది. ఆ మూవీ ఏదో కాదు బాద్షా. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పాటు బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచింది. 

36

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. బాద్షా చిత్రం కోసం ముగ్గురు స్టార్ హీరోలు తమ వంతు సాయం అందించారు. అది కూడా ఏమి ఆశించకుండా అని తారక్ తెలిపారు. ఈ చిత్ర ఓపెనింగ్ కి రాంచరణ్ హాజరై ఎన్టీఆర్ పై ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. రాంచరణ్ చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అయింది. 

 

46

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. తారక్ తో ఉన్న అనుబంధం, శ్రీనువైట్లతో ఉన్న ఫ్రెండ్ షిప్ తో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 

 

56

ఈ చిత్రానికి తనవంతు సాయం చేసిన మరో హీరో సిద్దార్థ్. సిద్దార్థ్ ఈ చిత్రంలో కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే. నా మీద ఉన్న ఇష్టంతో సిద్దార్థ్ ఆ రోల్ చేశాడు అని తారక్ తెలిపారు. 

 

66

ఆ తర్వాతి కాలంలో చరణ్, ఎన్టీఆర్ కలసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇలాంటి హెల్దీ కాంపిటీషన్ ఉండడం చాలా మంచిది అని తారక్ తెలిపారు. 

click me!

Recommended Stories