తన చిత్రాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా యువ హీరో నితిన్ జోరు మాత్రం మామూలుగా లేదు. నితిన్ ఇటీవల రియల్ లైఫ్ లో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన సతీమణి షాలిని మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. రెండు చిత్రాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. తమ్ముడు చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్ర బడ్జెట్ 70 కోట్లు దాటినట్లు తెలుస్తోంది.