ఆ కంటెస్టెంట్ విషయంలో నాగార్జున ఫైరా? ఫ్లవరా?, హోస్ట్ తీర్పు ఏమి కానుంది?

First Published | Sep 14, 2024, 12:39 PM IST

బిగ్ బాస్ హౌస్లో రెండో వారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ కంటెస్టెంట్ హద్దులు మీరి ప్రవర్తించగా, నాగార్జున ఎలాంటి తీర్పు ఇస్తాడనే ఉత్కంఠ నెలకొంది. 
 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 సెకండ్ వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున శనివారం ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ వారం హౌస్లో జరిగిన పరిణామాలు, కంటెస్టెంట్స్ ప్రవర్తన, పెర్ఫార్మన్స్ మీద రివ్యూ నిర్వహించనున్నాడు. 
 

Bigg boss telugu 8

కాగా సోనియా ఆకుల, యాష్మి గౌడ పరిధులు దాటి ప్రవర్తించారనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా విష్ణుప్రియను సోనియా పర్సనల్ అటాక్ చేసిన నేపథ్యంలో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. అనుచితంగా ప్రవర్తించిన వారిపై నాగార్జున ఫైర్ అవుతాడు. వాళ్లకు తగిన బుద్ధి చెబుతాడు. శిక్షలు వేస్తాడు. 

విష్ణుప్రియను ఉద్దేశిస్తూ సోనియా... అడల్ట్స్ జోక్స్ వేస్తావు. సరిగ్గా బట్టలు ధరించడం రాదు. నీ మైండ్ లో అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుందని, అన్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీని కూడా  సోనియా వివాదంలోకి లాగింది. విష్ణప్రియకు పేరెంట్స్ లేరన్న అర్థంలో... నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడరు. కానీ నాకు ఫ్యామిలీ ఉంది. వారు నా చర్యలను గమనిస్తారని, అన్నారు. 
 


Bigg boss telugu 8

విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యక్తిగత ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడిచింది. ఈ పరిణామం సోనియాకు మైనస్, విష్ణుప్రియకు ప్లస్ అయ్యింది. విష్ణుప్రియను ఎలిమినేట్ చేయండి. ఆమె ఇతరులను జడ్జి చేయడం మానుకోవాలి. గేమ్ గురించి కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడమేంటని బిగ్ బాస్ ఆడియన్స్ సోనియా పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
 

Yashmi Gowda


అలాగే మరో కంటెస్టెంట్ యాష్మి గౌడ ఓ టాస్క్ లో ప్రత్యర్థి టీమ్ ని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. తన బాడీ లాంగ్వేజ్ తో టీజ్ చేసింది. యాష్మి గౌడ ప్రవర్తన పై నాగార్జున రివ్యూ ఏంటనేది ఆసక్తికరం. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 


ఇక కిరాక్ సీత హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో నోటి నుండి బూతు పదం వచ్చింది. గత సీజన్లో బూతులు మాట్లాడిన కంటెస్టెంట్స్ కి నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మరి సీత మాట్లాడిన ఆ బూతు ఉందంతం నాగార్జున దృష్టికి వెళ్లిందా? వెళితే ఆయన రియాక్షన్ ఏమిటనేది చూడాలి. 

Bigg boss telugu 8

మరోవైపు నామినేషన్స్ లో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు. టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే. విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది. 
 

అనధికార పోల్స్ ప్రకారం డేంజర్ జోన్లో ఆదిత్య ఓం, పృథ్విరాజ్ ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆదిత్య ఓం కి నటుడిగా ఫేమ్ ఉన్నప్పటికీ గేమ్ పరంగా వెనుకబడ్డాడు. తెలుగు సరిగా రాకపోవడం కూడా మైనస్ అయ్యింది. ఇక పృథ్విరాజ్ టాస్క్ లలో సత్తా చాటుతున్నాడు. కానీ అగ్రెషన్ ఎక్కువగా ఉంది. మరి చూడాలి ఈ వారం ఇంటిని వీడేది ఎవరో? 
 

Latest Videos

click me!