Published : Dec 09, 2025, 07:24 AM ISTUpdated : Dec 09, 2025, 07:26 AM IST
రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలంతా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురి హీరోల కెరీర్ మాత్రం భిన్నంగా ఉంది. ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
దర్శక ధీరుడు రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత జక్కన్న గ్లోబల్ మార్కెట్ పై కన్నేశారు. పురాణాలు, టైం ట్రావెల్, గ్లోబ్ ట్రాటర్, సైన్స్ ఫిక్షన్ ఈ అంశాలని మిక్స్ చేసి మహేష్ బాబుతో 1500 కోట్ల భారీ బడ్జెట్ లో వారణాసి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా ఆ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ కావాల్సిందే. ప్రభాస్,, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ ఇలా రాజమౌళితో సినిమాలు చేసిన వారందరి పరిస్థితి ఇదే.
25
రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు ప్రత్యేకం
ఎన్టీఆర్ ఒక్కడే ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో దానిని బ్రేక్ చేశారు. దేవర మంచి హిట్ అయింది. అయితే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత మాత్రం తారక్ కి కూడా ఫ్లాపులు తప్పలేదు. ఇదిలా ఉండగా రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో ముగ్గురి కెరీర్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆ ముగ్గురు హీరోలు నితిన్, సునీల్, నాని. ఈ ముగ్గురు హీరోల కెరీర్ ఎందుకు భిన్నంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
35
నితిన్
రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే చిత్రంలో నటించాడు. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ పడుతుంది అని తెలుసు కానీ.. ఏకంగా కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది అని నితిన్ ని చూస్తే అర్థం అవుతుంది. సై తర్వాత నితిన్ కి వరుసగా 12 ఫ్లాపులు పడ్డాయి. ధైర్యం నుంచి మారో వరకు అన్నీ ఫ్లాపులే. నితిన్ కెరీర్ పూర్తిగా పతనం అవుతుంది అనే టైంలో ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఇచ్చారు. రాజమౌళి హీరోల్లో స్టార్ స్టేటస్ కి దూరంగా ఉన్న వారిలో నితిన్ ఒకరు.
రాజమౌళితో సినిమా చేసి స్టార్ కాలేకపోయిన వారిలో సునీల్ కూడా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ మర్యాద రామన్న చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మర్యాద రామన్న మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సునీల్ పూర్తి స్థాయిలో హీరోగా మారడానికి ప్రయత్నించాడు. కామెడీ రోల్స్ పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో కొన్ని హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది సునీల్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ వచ్చాయి. దీనితో క్రమంగా సునీల్ ని హీరోగా పెట్టి సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో సునీల్ తిరిగి క్యారెక్టర్ రోల్స్, కామెడీ పాత్రలు వేయాల్సి వచ్చింది.
55
నాని
రాజమౌళి హీరోల్లో నాని కూడా ప్రత్యేకమే. రాజమౌళి దర్శకత్వంలో నాని పూర్తి స్థాయిలో నటించలేదు. ఈగ చిత్రంలో కేవలం 20 నిమిషాల రోల్ చేశారు అంతే. కానీ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ లాంటి హీరోల తరహాలో నానికి మాస్ ఇమేజ్ ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే నాని మాస్ చిత్రాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ లో నటిస్తున్నాడు.