Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌

Published : Dec 09, 2025, 12:21 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 సంజనా మరోసారి బకరా అయ్యింది. ఆమెకి జీరో అమౌంట్‌ రావడంతో జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దీనికితో బిగ్‌ బాస్‌ భరణికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 14వ వారం ఆసక్తికరం

బిగ్‌ బాస్‌ తెలుగు 9 13 వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఆదివారం రీతూ చౌదరీ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ఇక 14వ వారంలోకి అడుగుపెట్టాం. మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారంలో తనూజ, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, సంజనా, భరణి హౌజ్‌లో ఉన్నారు. అయితే ఇప్పటికే కళ్యాణ్‌ ఫైనల్‌కి చేరుకున్న విషయం తెలిసిందే. టికెట్‌ టూ ఫినాలేలో విజయం సాధించి టాప్‌ కి చేరుకున్నాడు. మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు.

25
వారంతా నామినేషన్‌లోనే

ఇక మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్‌ కి ఎవరు చేరుకుంటారు. ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంది. అంటే టాప్‌ 5 కంటెస్టెంట్లని ఎంపిక చేస్తే ఆటోమెటిక్‌గా ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలుస్తుంది. దీంతోపాటు ఈ సీజన్‌ ఎవరు విన్నర్‌గా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఆరుగురు నామినేషన్‌లో ఉంటారు. కాకపోతే ఈ వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు బిగ్‌ బాస్‌.

35
ఇమ్మాన్యుయెల్‌ టాప్‌ ర్యాంక్‌

ఈ సందర్బంగా ఈ మేరకు టాస్క్ లు ఇస్తున్నారు. అందులో భాగంగా ఫస్ట్ ర్యాంగింగ్‌ టాస్క్ ఇచ్చారు. ఆరు పెట్టలున్నాయి. వాటిలో ఒక అమౌంట్‌ ఉంటుంది. ఫస్ట్ బాల్‌ని పట్టుకున్న వాళ్లు ఉన్న అమౌంట్లలో ఎవరు దేనికి అర్హులనేది కారణం చెప్పి వారికి ఆ అమౌంట్‌ కేటాయించాల్సి ఉంటుంది. దానికి ర్యాంకింగ్‌ ఇస్తారు. అందులో భాగంగా డీమాన్‌ పవన్‌ బాల్‌ పట్టుకుని సుమన్‌ శెట్టికి ఒక లక్ష ఇచ్చారు. భరణి బాల్‌ పట్టుకుని తనూజ రెండు లక్షలకు అర్హురాలు అని, కళ్యాణ్‌ బాల్‌ పట్టుకుని ఇమ్మాన్యుయెల్‌కి 250000 ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో ఇమ్మూ టాప్‌ ర్యాంక్‌ సాధించాడు.

45
జైలుకి సంజనా

ఇమ్మాన్యుయెల్‌ బాల్‌ పట్టుకొని సంజనాకి 150000 ఇవ్వగా, అంతా రిజెక్ట్ చేశారు. దీంతో ఆమెకి లేదు. ఆ తర్వాత భరణి డీమాన్‌ పవన్‌కి 150000కి ఓకే చెప్పారు. ఆతర్వాత చివరగా 50000, జీరో అమౌంట్లు మిగిలాయి. జీరో సంజనాకి, 50000 భరణికి ఇచ్చారు. సంజనా జీరోకి పడిపోయింది. ఈ సీజన్‌లో ఆమె పర్‌ఫెర్మెన్స్ కి కొలమానం ఇదే అని చెప్పి జీరో వచ్చిన సంజనాని జైల్లో పెట్టారు. బిగ్‌ బాస్‌ ఆదేశాల వరకు ఆమె అందులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో తానే ప్రతి సారీ ఫూల్‌ని అవుతానని ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది.

55
భరణికి బంపర్‌ ఆఫర్‌

అనంతరం బాల్స్ ని తన రింగ్‌లో పెట్టే టాస్క్ జరిగింది. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ మొదట టాస్క్ చేయగా, భరణి రెండో స్థానంలో, డీమాన్‌ పవన్‌ మూడు, తనూజ నాల్గో స్థానంలో, సుమన్‌ శెట్టి ఐదో స్థానంలో నిలిచారు. ఇలా వీరే టాప్‌ 5 కంటెస్టెంట్లు అంటూ భరణి, ఇమ్మాన్యుయెల్‌ వెల్లడించారు. వీరి మధ్య చర్చ ఆసక్తికంగా సాగింది. మొత్తంగా సోమవారం ఎపిసోడ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇందులో భరణికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. హౌజ్‌లో ఉన్న వారిలో అంతా విన్నర్‌ అయ్యారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories