ExtraOrdinaryManReview:ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీమియర్ టాక్, కామెడీ పైనే భారం.. నితిన్ మూవీ హిట్టా ఫట్టా

First Published Dec 8, 2023, 6:52 AM IST

ఇటీవల పాలిటిక్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటనల ప్రభావం కూడా ఫన్నీ సన్నివేశాల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ముందు వరకు కామెడీ అన్ స్టాపబుల్ అనిపించేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాస్త జోరు తగ్గింది. 

రేసుగుర్రం, టెంపర్, కిక్ చిత్రాలతో స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన వక్కంతం వంశీ రెండవసారి దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దర్శకుడిగా తెరకెక్కించిన నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రిలీజ్ కి ముందు ఈ చిత్రం మంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. ట్రైలర్, సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రాజశేఖర్ కామియో అప్పియరెన్స్ అందరిలో ఆసక్తి పెంచుతోంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. యుఎస్ లో ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఎక్స్ట్రా చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో తెలుసుకుందాం. 

Latest Videos


హిలేరియస్ గా అనిపించే ఛేజింగ్ సన్నివేశంతో ఈ చిత్రం మొదలవుతుంది. తొలి సన్నివేశం నుంచే నితిన్ కామెడీ టైమింగ్ బాగా కుదిరింది. వక్కంతం వంశీ ప్రతి కామెడీ బ్లాక్ ని కడుపుబ్బా నవ్వించేలా రాసుకున్నారు. వక్కంతం వంశీ రచయితగా తన గత చిత్రాల్లో కామెడీ ఎంతబాగా వర్కౌట్ అయ్యిందో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్ర కథ రాసుకునట్లు అనిపిస్తుంది. ఆయా చిత్రాల ప్రభావం కూడా ఎక్స్ట్రా మూవీలో ఉంటుంది. 

ఇటీవల పాలిటిక్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటనల ప్రభావం కూడా ఫన్నీ సన్నివేశాల్లో ఉంటుంది. దిల్ రాజు డాన్స్ వెనుమా స్పీచ్ ని కూడా వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ ముందు వరకు కామెడీ అన్ స్టాపబుల్ అనిపించేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాస్త జోరు తగ్గింది. 

అయితే నితిన్ పెర్ఫామెన్స్ లో మాత్రం ఆ జోరు ఎక్కడా తగ్గలేదు. ప్రతి సన్నివేశాన్ని నితిన్ ఎనెర్జిటిక్ గా పెర్ఫామ్ చేశాడు. కామెడీ సన్నివేశాలు బాగానే పడినప్పటికీ కథ విషయంలో కాస్త పెదవి విరుస్తున్నారు. హీరో, విలన్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పేలలేదు. కథకి సింక్ కాకుండా ఆ సీన్స్ ఉంటాయి అని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

సినిమా మొత్తం వినోదానికి ఢోకా లేకుండా జాగ్రత్త పడ్డారు. హీరోయిన్ శ్రీలీల పాత్ర పాటలు, కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం అవుతుంది. హరీష్ జైరాజ్ సంగీతం బావుంది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. 

ఓవరాల్ గా ఇతర అంశాలన్నీ పక్కన పెట్టి ఫన్ కోసమే వెళితే ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనే రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం వక్కంతం వంశీని దర్శకుడిగా నిలబడుతుందా.. నితిన్ కి అవసరమైన హిట్ అందిస్తుందా అనేది చూడాలి. 

click me!