నితిన్ కి లక్కీ ఛాన్స్.. మరి నాగ చైతన్య సంగతేంటి

First Published | Oct 12, 2024, 5:33 PM IST

గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ కావడంతో మిగిలిన చిత్రాల రిలీజ్ డేట్స్ వ్యవహారాలు కూడా మారిపోతున్నాయి. 

గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ కావడంతో మిగిలిన చిత్రాల రిలీజ్ డేట్స్ వ్యవహారాలు కూడా మారిపోతున్నాయి. అనుకున్న సమయానికి ఆగస్టులో పుష్ప 2 రిలీజ్ అయి ఉంటే చాలా మీడియం బడ్జెట్ చిత్రాలకు డిసెంబర్ లో అవకాశం దక్కేది. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. 

దీనితో కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్లు అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే దిల్ రాజు రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం క్రిస్టమస్ కి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. దీనితో మీడియం బడ్జెట్ చిత్రాలకు డిసెంబర్ లో ఛాన్స్ లేదు. సంక్రాంతికి వద్దామన్నా కుదరని పరిస్థితి. దీనితో నితిన్, నాగ చైతన్య లాంటి హీరోలు సైలెంట్ అయిపోయారు. 


ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. దీనితో నితిన్ తన చిత్రంతో మళ్ళీ జోరు పెంచాడు. గేమ్ ఛేంజర్ చిత్రం పోస్ట్ పోన్ అని తెలియగానే వెంటనే తన రాబిన్ హుడ్ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాడు. డిసెంబర్ 20న రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అవుతున్నట్లు మైత్రి మూవీస్ సంస్థ అనౌన్స్ చేసింది. ఇది నితిన్ కి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. నితిన్ కి భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ముందుగా డిసెంబర్ లో రావాలనుకున్న నాగ చైతన్య తండేల్ మూవీ పరిస్థితి ఏంటో ఇంకా తెలియలేదు. అయితే అప్పటికల్లా తండేల్ కంప్లీట్ అవుతుందా అనేది అనుమానమే. 

Latest Videos

click me!