ఐశ్వర్య రాయ్ కి వింత వ్యాధి, అందుకే అలా అయిపోయిందా..?

First Published | Oct 12, 2024, 5:07 PM IST

మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కు వింత వ్యాధి ఉందా..? ఆదుకే ఆమె రూపంలో ఈ మార్పులు వస్తున్నాయా..? నిజం ఎంత..? 

ఐశ్వర్య రాయ్.. ఒకప్పుడు యూత్ కు కలల రాకుమారి. ఎప్పడు ఏదో రకంగా వైరల్ న్యూస్ అవుతుంటుంది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం విడాకులు వార్తల్లో నిలుస్తోంది. బచ్చన్ ఫ్యామిలీ కోడలిగా వెళ్ళిన ఆమె.. దాదాపు 17 ఏళ్లకు పైగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. కాని ఓ ఏడాదికిపైగా ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. 

మహేష్ బాబు ఫారెన్ టూర్లపై ఎన్టీఆర్ సెటైర్లు..

ఫ్యామిలీలో మనస్పర్దలు వచ్చాయని.. అందుకే విడాకులు తీసుకోబోతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఎప్పుడు ఏ ఫంక్షన్ కు అయినా భర్తతో కలిసి వెళ్ళే వారు ఐష్. కాని ఇఫ్పుడు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తున్నారు. లేదంటే తన కూతురు ఆరాధ్యను తీసుకుని వెళ్తున్నారు. రీసెంట్ గా అంబాని పెళ్లికి కూడా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళలేదు. 
 


ఐశ్వర్య రాయ్ తన కూతురితో కలిసి వెళ్లింది. అయితే విచిత్రం ఏముంది అనుకోవచ్చు. అదే పెళ్ళికి అభిషేక్ తన తల్లీ తండ్రులతో కలిసి వచ్చాడు. ఇంతకీ వీరంతా కలిసి ఎందుకు వెళ్ళలేదు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అయితే వీరికి విడాకులు కాలేదు.. కలిసి ఉంటున్నారు అనేది మరికొందరి వాదన. ఐష్ చేతికి వెడ్డింగ్ రింగ్ అలాగే ఉంది అంటున్నారు అభిమానులు. 
 

మరో వైపు తాజాగా రెడిట్ లో ఓ సోషల్ మీడియా యూజర్ చేసిన వాఖ్యలు ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఐశ్వర్యరాయ్ కి వింత వ్యాధి ఏదైనా వచ్చి ఉంటుంది. అందుకే ఆమె శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె ఒకప్పుడు నాజూగ్గా ఉండేది. కాని ఇప్పుడు చాలా లావైపోతోంది. తేడా కనిపిస్తుంది అని అది తన అభిప్రాయం మాత్రమే అన్నాడు. 
 

అయితే గతంలో కూడా చాలా సార్లు బాలీవుడ్ లో ఈ విషయంలో చర్చ జరిగింది. ఐశ్వర్య రాయ్ ఏంటి ఇలా అయ్యింది. ఆమె చాలా ఫిట్ గా మెయింటేన్ చేస్తుంది కదా.. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా అని అనుకున్నారు.

ఇక ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. బెంగళురుకు చెందిన ఐశ్వర్య.. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. మిస్ ఇండియాగా, మిస్ యూనివర్స్ గా గెలిచింది. ఆతరువాత తమిళ సినిమాద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తమిళంలో ఎక్కువ సినిమాులు చేసంది.

ఆతరువా బాలీవుడ్ కు చేరింది. అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు తమిళంలో సినిమాలు చేస్తుంది కాని ఆమె తెలుగు సినిమాలు చేసింది లేదు. 
 

బాలీవుడ్ లో వివేక్ ఒబేరాయ్ తో ప్రేమలో పడిన ఐశ్వర్య రాయ్.. ఆతరువాత సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసింది. ఇక ఫైనల్ గా 2007 లో అభిషేక్ బచ్చన్ ను పెళ్ళి చేసుకుని అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది. వీరికి ఆరాధ్య అనే అమ్మాయి  కూడా ఉంది. ఇక వీరి విడాకులపై ఎప్పుడు ఓపెన్ అవుతారో చూడాలి. 
 

Latest Videos

click me!