యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ చిత్రంలో ఇంకో బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ చిత్రం మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తారని తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. సంతోష్.. వెంకటేష్ కి కథ చెప్పారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ షురూ చేయడమే. కథ వెంకటేష్ పాత్ర చుట్టూ ఉంటుందని టాక్.
Keerthy Suresh
ఇది కంప్లీట్ మల్టీస్టారర్ చిత్రమా లేక నితిన్ పాత్ర కొన్ని సీన్లకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాల్సి ఉంది. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రంగ్ దే చిత్రంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ చిత్రంలో నితిన్ లాయర్ గా, వెంకటేష్ పోలీస్ గా కనిపిస్తారట. ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.