నాగచైతన్యకి కాబోయే భార్య శోభితా కలలు కన్న జాబ్‌ ఏంటో తెలుసా? రాష్ట్రపతి వద్ద అంటూ ఏవేవో ఊహించుకుంది కానీ!

First Published | Oct 18, 2024, 5:52 PM IST

నాగచైతన్య.. హీరోయిన్‌ శోభితా దూళిపాళని రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే తాను మాత్రం హీరోయిన్‌ కావాలనుకోలేదట. ఆ రహస్యాన్ని బయటపెట్టింది శోభిత. 
 

నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోయిన్‌ శోభితా దూళిపాళని సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. చాలా రోజులుగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దాటవేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యారు. అది కూడా ఎంగేజ్‌మెంట్‌ తో సర్‌ప్రైజ్‌ చేశారు. పెద్దల సమక్షంలోనే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరగడం విశేషం. ఆ ఫోటోలు ఆ మధ్య నెట్టింట హల్‌చల్‌ చేశాయి. అక్కినేని ఫ్యాన్స్ ని హ్యాపీ చేశాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇదిలా ఉంటే శోభితా దూళిపాళ్ల బోల్డ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన పాత్రలు అలా ఉండటం వల్లే ఆ ట్యాగ్‌ వచ్చింది. అంతేకాదు ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలు కూడా అదే రేంజ్‌లో ఉండటంతో వామ్మో శోభితా టూ బోల్డ్ అనే కామెంట్స్ ని ఎదుర్కొంది. తెలుగులో కంటే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తున్న శోభితా దూళిపాళ ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే సమంతతో పెళ్లి అయి విడాకులు తీసుకున్న నాగచైతన్యని వివాహం చేసుకోబోతుంది. శోభితాకిది ఫస్ట్ మ్యారేజ్‌ అనేది తెలిసిందే. 
 


ఇదిలా ఉంటే శోభితా దూళిపాళ మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి. వాళ్ల నాన్న వేణుగోపాల్‌ రావు నేవీ ఇంజనీర్‌. మదర్‌ స్కూల్‌ టీచర్‌. శోభితా ఎక్కువగా విశాఖపట్నంలోనే పెరిగింది. ఇంటర్‌ వరకు ఆమె అక్కడే చదువుకుంది. ఆ తర్వాత డిగ్రీ కోసం ముంబయి వెళ్లింది శోభిత. అక్కడే మోడలింగ్‌లోకి ప్రవేశించింది. మోడల్‌గానే అనేక అవమానాలు ఫేస్‌ చేసింది శోభిత.

శాంపూ యాడ్స్ ఆడిషన్స్ కి వెళితే తెల్లగా లేవని, బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికి రావు అంటూ హేళన చేశారట. అలాంటిది తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత అదే యాడ్‌లో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించడం విశేషం. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభిత దాదాపు వంద ఆడిషన్‌కి వెళ్లగా, `రామన్‌ రాఘవ్‌ 2.0` సినిమాకి అనురాగ్‌ కశ్యాప్‌ ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది శోభిత. 
 

ఇదిలా ఉంటే హీరోయిన్‌ కావాలనేది శోభితా డ్రీమ్‌ కాదు. ఆమె అసలు డ్రీమ్‌ వేరే ఉంది. తాను ఎకనమిస్ట్ కావాలని కలలు కన్నదట. రాష్ట్రపతి వద్ద పనిచేయాలని, రాష్ట్రపతికి చీఫ్‌ ఎకనమిస్ట్ అడ్వెయిజర్‌గా జాబ్‌ చేయాలని అనుకుందట. తన దృష్టి అంతా దానిపైనే ఉండేదట. చాలా మంది తన ఫ్రెండ్స్ హీరోల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే, తాను మాత్రం ఎకనమిస్ట్ లు ఆర్బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌, చిదంబరం, శశిథరూర్‌ల గురించి మాట్లాడేదట. దీంతో అందరు తనని విచిత్రంగా చూసేవాళ్లని తెలిపింది శోభితా. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది శోభిత. 
 

Naga Chaitanya and Sobhita

బాలీవుడ్‌ మూవీ `రామన్‌ రాఘవ్‌ 2.0` సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శోభితా దూళిపాళ.. తెలుగులో `గూఢచారి`, `మేజర్‌` చిత్రాల్లో నటించింది. హిందీలో `చెఫ్‌`, `కాలకాండి`, `ది బాడీ`తోపాటు తమిళంలో `పొన్నియిన్‌ సెల్వన్‌ ` రెండు భాగాల్లో, అలాగే మలయాళంలో `కురుప్‌` చిత్రంలో నటించి మెప్పించింది. ఇటీవలే ఆమె నటించిన `లవ్‌ సితార`  మూవీ థియేటర్లోకి వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక త్వరలో నాగచైతన్యని మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అవుతుంది శోభిత. 

Read more: `ది డీల్‌` తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!