శౌర్యకు ఐ లవ్యూ చెప్పిన నిరుపమ్.. హిమను లాగిపెట్టి కొట్టిన సౌందర్య.. అసలు ట్విస్ట్ ఇదే!

Published : May 14, 2022, 08:29 AM ISTUpdated : May 14, 2022, 08:55 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
శౌర్యకు ఐ లవ్యూ చెప్పిన నిరుపమ్.. హిమను లాగిపెట్టి కొట్టిన సౌందర్య.. అసలు ట్విస్ట్ ఇదే!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్య (Sathya) పనిలో పనిగా ప్రేమ్ కి కూడా ఒక సంబంధం చూస్తే సరిపోతుంది కదా అని స్వప్న తో అంటాడు. స్వప్న (Swapna) ప్రేమ్ కే కాదు నిరూపమ్ కి కూడా చూడాలని అంటుంది. ఈ నిశ్చితార్థం జరగనివ్వను ఉంగరాలు కూడా నేనే తీసాను అని చెప్తుంది.

26

ఇక నిశ్చితార్థం పీటల మీద కూర్చొని ఉన్న హిమ (Hima) దేవుడికి దండం పెట్టుకుంటున్న జ్వాల (Jwala) ను చూసి ఒక రేంజ్ లో టెన్షన్ పడుతుంది. ఇక తాంబూలాలు మార్చుకునే సమయానికి హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దాంతో అక్కడ ఉన్న వారంతా ఒకసారి గా ఆశ్చర్యపోతారు.

36

ఇక సౌందర్య (Soundarya) ఎంత చెప్పినా వినకుండా హిమ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఫ్యామిలీ మొత్తం విచారం వ్యక్తం చేస్తూ ఉండగా స్వప్న (Swapna) మాత్రం ఒక రేంజ్ లో చిల్ అవుతుంది. అంతే కాకుండా నిశ్చితార్థం వరకూ తీసుకు వచ్చి అందరి ముందు నా పరువు నా కొడుకు పరువు తీసేసారు అని అంటుంది.

46

ఇక తలవంపులు మాకు తెచ్చి నువ్వు తల వొంచుకుంటావేంటి అని తన తల్లిని దెప్పి పొడుస్తుంది. మరోవైపు హిమ (Hima) తన తల్లి దండ్రుల ఫోటోలు ముందుకు వెళ్లి సౌర్య కోసం నా ప్రేమను అడ్డు వేసాను అని చెబుతుంది. ఇక సౌర్య మనసులో నిరూపమ్ (Nirupam) ఉన్నాడు అని హిమకు తెలుస్తుంది.
 

56

అదెలా అంటే? జ్వాలా (Jwala) రెస్టారెంట్ లో వాష్ రూమ్ కి వెళ్ళిన రోజు జ్వాలా ఫోన్ కి నిరూపమ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక నిరూపమ్ (Nirupam) పేరుకి బదులుగా జ్వాల నా మొగుడు అని సేవ్ చేసుకుంటుంది. అది గమనించిన హిమ ఆరోజు రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎలాగైనా నిరూపమ్ బావతో సౌర్య కు పెళ్లి చేస్తాను అని అంటుంది.
 

66

ఆ తర్వాత హిమను (Hima) సౌందర్య చెంపమీద గట్టిగా కొడుతుంది. మరోవైపు నిరూపమ్ కారు లో ఫుల్ గా తాగి పడుకుంటాడు. అది గమనించిన జ్వాల మీరు తాగడం ఏమిటి? అని అడుగుతుంది. తాగిన మత్తులో నిరూపమ్ (Nirupam) నేను నీకు ఇష్టమే కదా.. ఐ లవ్ యూ అని అంటాడు. దాంతో జ్వాల ఎంతో ఆనందపడుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
 

click me!

Recommended Stories