Ramarao on duty review
కథ
రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. రాయలసీమలో గల ఓ ప్రాంతానికి అధికారిగా వచ్చిన రామారావు సీరియస్ కేస్ ని ఛేదించే బాధ్యత తీసుకుంటాడు. ఒకేసారి కనపడకుండా పోయిన కూలీల జాడ తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కనపడకుండా పోయిన జనాలు ఏమయ్యారు? వాళ్ళ అదృశ్యం వెనుక ఎవరున్నారు? ఈ సీరియస్ క్రైమ్ ని రామారావు ఎలా ఛేదించారు? అనేది మొత్తంగా రామారావు ఆన్ డ్యూటీ కథ..
Ramarao on duty review
దర్శకుడు శరత్ మండవ యాక్షన్ అండ్ సస్పెన్సు క్రైమ్ డ్రామాగా రామారావు ఆన్ డ్యూటీ తెరక్కించినట్లు తెలుస్తుంది. మూవీ అధిక భాగం ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో లాగించేశాడు. తమ వారు కనిపించకుండా పోవడంతో కొందరు పేదలు రామారావుని ఆశ్రయించడం, వాళ్ళ ఆచూకీ కోసం రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అన్న కోణంలో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది.
Ramarao on duty review
ప్రీమియర్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ డీసెండ్. రామారావుగా రవితేజ(Raviteja) ఇంట్రో సీన్స్ అదిరిపోయాయి అంటున్న ఆడియన్స్... స్లో నేరేషన్, ఆసక్తిరేపని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇబ్బంది పెట్టాయి. హీరో రవితేజ రామారావుగా అదుర్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, మాస్ మేనరిజం ఆకట్టుకున్నాయి. సాంగ్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. సీరియస్ గా నడుస్తున్న స్టోరీ మధ్యలో సాంగ్స్ సింక్ కాలేదన్న మాట వినిపిస్తుంది.
Ramarao on duty review
హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్న దర్శకుడు సరైన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వలేదని ప్రేక్షకుల అభిప్రాయం. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ పాటల పరంగా నిరాశపరిచినా బీజీఎమ్ అదరగొట్టాడు. రవితేజ మాస్ సీన్స్ ఆయన బీజీఎమ్ తో సూపర్ గా ఎలివేట్ అయ్యాయి అంటున్నారు. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో కొంచెం కొత్తగా స్క్రీన్ ప్లే ట్రై చేశారు.
హీరో తొట్టెంపూడి ఈ మూవీతో కం బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన పాత్ర రామారావు ఆన్ డ్యూటీలో అద్భుతంగా ఉంటుందని ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఊహించిన స్థాయిలో ఆయన పాత్ర ఎస్టాబ్లిష్ కాలేదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వేణు అంతగా ప్రభావం చూపలేకపోయాడన్న టాక్ వినిపిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో పొలిటికల్ మాఫియా స్వార్దానికి బలైపోతున్న అమాయకుల జీవితాలను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. డిప్యూటీ కలెక్టర్ రామారావు కాస్త... పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మారిపోయాడు. ఎక్కడో మొదలైన కథ మంగళూరుకి వెళ్లి అక్కడ నుండి శేషాచలం రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వద్ద ఆగింది. సెకండ్ హాఫ్ లో సైతం మూవీ పిక్ అప్ కాలేదు. దీనికి ప్రధాన కారణం బలహీనమైన స్క్రీన్ ప్లే. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి పట్టుసడలని స్క్రీన్ ప్లే చాలా అవసరం. రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On duty review) చిత్రాన్ని అది పెద్ద మైనస్.
కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్స్ పాత్రల గురించి పెద్దగా చెప్పుకోకపోవడమే మంచిది. రామారావు ఆన్ డ్యూటీ మూవీలో హీరోయిన్స్ గా నటించిన దివ్యాంష కౌశిక్, రజీష విజయన్ గురించి ఒక్కరు కూడా మాట్లాడకపోవడం విశేషం. కాబట్టి వాళ్ళ పాత్రలు సినిమాలో సోసో గా ఉండవచ్చు.
మొత్తంగా రామారావు ఆన్ డ్యూటీ ప్రీమియర్ టాక్ పరిశీలిస్తే ఇది ఓ డీసెంట్ మూవీ అని చెప్పవచ్చు . రవితేజ మాస్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అలరించే అంశాలు. సామ్ సీఎస్ బీజీఎం కూడా బాగుంది అంటున్నారు. అయితే స్లో నేరేషన్, కథలో బలం లేకపోవడం, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే, సాంగ్స్ నిరాశపరిచే అంశాలు. ఏదైనా పూర్తి రివ్యూ వస్తే కానీ చెప్పలేం...