karthika deepam: హిమను మళ్లీ మళ్లీ ఏడిపిస్తున్న శౌర్య.. హిమకు క్యాన్సర్ విషయం తెలుసుకున్న నిరుపమ్!

Published : Jul 18, 2022, 08:20 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
karthika deepam: హిమను మళ్లీ మళ్లీ ఏడిపిస్తున్న శౌర్య.. హిమకు క్యాన్సర్ విషయం తెలుసుకున్న నిరుపమ్!

ఈ రోజు ఎపిసోడ్ లో హిమ(hima) అన్న మాటల గురించి సౌందర్య, ఆనందరావు లకి చెప్పుకొని కోప్పడుతూ ఉంటాడు నిరుపమ్. అప్పుడు ఆనందరావు కంగారు పడకు అని చెప్పగా వెంటనే నిరుపమ్(Nirupam)కంగారు పడకుండా ఎలా ఉండాలి చెప్పండి. మీరేనా హేమకు నచ్చచెప్పండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిరుపమ్.
 

27

 అప్పుడు ఆనంద్ రావు(soundarya),సౌందర్య లు,నిరుపమ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వస్తుంది. అప్పుడు సౌందర్య ఏంటి హిమ ఇది అని అడగగా అప్పుడు హిమ,సౌర్య(sourya)కు, నిరుపమ్ బావ అంటే ఇష్టం తనకు ప్రాణం. సౌర్య ఆనందమే మా ఆనందం. నిరుపమ్ బావతో ఎలా అయిన సౌర్య కీ పెళ్లి చేస్తాను అందుకోసం ఏమైనా చేస్తాను అని అనగా ఇంతలోనే అక్కడికి సౌర్య వస్తుంది.
 

37

 నన్ను డాక్టర్ సాబ్ ని కలపడం కోసం నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావా.. కానీ నేను నిన్ను అర్థం చేసుకోకుండా శత్రువులా చూసాను అంటూ ఎమోషనల్ గా హత్తుకుంటుంది సౌర్య(sourya). మనం ఎప్పటిలాగే చిన్నప్పటిలా కలిసి ఉందాం అని అంటూనే కన్నీళ్లు తుడుచుకుంటూ ఇదే కదా నువ్వు కోరుకుంటుంది అని అంటుంది.
 

47

అప్పుడు సౌర్య మళ్లీ నీ మాయలో పడిపోయి నిన్ను మెచ్చుకొని దగ్గర తీసుకుంటాను అని అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు హిమ (hima)అసలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించినా కూడా సౌర్య వినిపించుకోదు. అప్పుడు సౌర్య మాటలకు హిమ ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు నిరుపమ్(Nirupam)కోపంతో వస్తువులన్నీ విసిరేస్తూ ఉండగా ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ఆ హిమను పెళ్లి చేసుకోవద్దు అని మొదటినుంచి చెబుతున్నాను కదా అని అంటుంది.
 

57

అప్పుడు నిరుపమ్, స్వప్న(swapna)మీద సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య,ఆనంద్ రావ్(anand rao)లు జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి సౌర్య వచ్చి ఆటో నడిపే విషయం గురించి మాట్లాడుతూ..ఇప్పుడు మనం ధనవంతులం మన ప్రస్టీజ్ పోతుంది అందుకే ఆటో నడపవద్దు అంటావా తాతయ్య అని అడుగుతుంది.
 

67

అప్పుడు సౌందర్య(soundarya), ఆనంద్ రావులు ఆటో నడపవద్దు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. అప్పుడు హిమ గురించి సౌందర్య నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా సౌర్య మరింత అపార్థం చేసుకుంటుంది. ఇంతలోనే అక్కడికి హిమ(hima)కాపాడిన అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో సౌందర్య వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య మాత్రం వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
 

77

వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత హిమ(hima)గురించి మరింత అపార్థం చేసుకుంటుంది. అప్పుడు సౌందర్య హిమల గురించి ఎందుకు చెప్పినా కూడా సౌర్య వినిపించుకోదు. మరొకవైపు నిరుపమ్(Nirupam),స్వప్న తో వాళ్ళ డాడీ గురించి అడిగి సత్యని ఒకసారి హిమతో మాట్లాడమని చెబుతాడు. అప్పుడు స్వప్న,నిరుపమ్ పై సీరియస్ అవుతుంది. అప్పుడు నిరుపమ్,హిమ నే నా భార్య అని స్వప్నకు తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

click me!

Recommended Stories