ఇటీవల కత్రినా కైఫ్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి మాల్దీవులకు వెళ్ళింది. వీరితో పాటు ఇలియానా కూడా కత్రినా బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. సెబాస్టియన్ తో డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇలియానా కూడా కత్రినా కైఫ్ ఫ్యామిలిలో మెంబర్ గా మారిపోయింది అని అంటున్నారు. లేకపోతే కత్రినా బర్త్ డే వేడుకలకు ఇలియానా ఎందుకు మాల్దీవులకు వెళుతుంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.