మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు.. 'స్పై' లో నేతాజీ డెత్ మిస్టరీ టచ్ చేశాం, నిఖిల్ స్ట్రాంగ్ కామెంట్

Published : Jun 23, 2023, 10:42 AM IST

ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై.  గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
16
మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు.. 'స్పై' లో నేతాజీ డెత్ మిస్టరీ టచ్ చేశాం, నిఖిల్ స్ట్రాంగ్ కామెంట్

ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై.  గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై మూవీ జూన్ 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఏ చిత్రంలో నిఖిల్ సరసన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

26

గురువారం రోజు విడుదలైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్పై మూవీ ఒక గూఢచారి కథ మాత్రమే కాదు ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డేట్ మిస్టరీ గురించి కూడా ఆసక్తికర అంశాలు ఉన్నట్లు ట్రైలర్ తో అర్థం అయింది. కథలో కీలక అంశం కూడా అదే అని తెలుస్తోంది. నేతాజీ అదృశ్యం, మరణం పట్ల దేశం మొత్తం భిన్న వాదనలు, వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. 

36

ఆలాగే నిఖిల్ నటించే చిత్రాల వెనుక ఓ పొలిటికల్ పార్టీ ప్రభావం ఉందనే ప్రచారం కూడా కార్తికేయ 2 విడుదలైనప్పటి నుంచి సాగుతోంది. స్పై మూవీలో నేతాజీ అంశం గురించి నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వివరణ ఇచ్చాడు. 

46

మా చిత్రం రాజకీయాలకు సంబందించినది కాదు. ఒక జెన్యూన్ చిత్రం మేము చేశాం. మాకు, ఈ చిత్రానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. నేతాజీ డెత్ మిస్టరీ మాత్రమే కాదు..ఆయన ఆలోచన విధానం, దేశానికి ఆయన వల్ల జరిగిన ఉపయోగం ఇలా చాలా విషయాలని ఈ చిత్రంలో చర్చించాం అని నిఖిల్ తెలిపారు. 

56

ట్రైలర్ చివర్లో ఓ డైలాగ్ ఉంటుంది.. స్వాతంత్రం ఎవరో ఇచ్చేది కాదు.. లాక్కునేది.. ఈ చిత్ర థీమ్ ని ఆ డైలాగ్ బట్టే అర్థం చేసుకోవచ్చు అని నిఖిల్ అన్నారు. ఇక ప్ర ప్రమోషన్స్ గురించి కూడా నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆదిపురుష్ చిత్రం రీసెంట్ గా రిలీజ్ కావడం వల్ల అప్పుడు స్పై ప్రమోషన్స్ చేస్తే ఎవరికీ కనపడం. అందువల్లే ఆలస్యం జరిగింది. 

66

ఇక ఇప్పటి నుంచి మొదలు పెట్టి రిలీజ్ తర్వాత కూడా స్పైని ప్రమోట్ చేస్తాం అని నిఖిల్ తెలిపారు. అలాగే రాంచరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'ది ఇండియా హౌస్' అనే చిత్రం గురించి కూడా నిఖిల్ ఓపెన్ అయ్యారు. రాంచరణ్ గారు గ్లోబల్ స్టార్, జెన్యూన్ పర్సన్. ఆయన ఈ కథని నేను బాగా సెట్ అవుతానని నమ్మి నాతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమంతా కష్టపడుతున్నాము అని నిఖిల్ తెలిపారు. 

click me!

Recommended Stories