సావిత్రి చివరి రోజుల్లో ఎందులో నివసించిందో తెలుసా? అంతకంటే దారుణ స్థితి మరోటి లేదు!

First Published | Oct 29, 2024, 10:53 PM IST

మహానటి సావిత్రి చివరి రోజుల్లో చాలా దీన స్థితిలో బతికిందని అంటుంటారు. కానీ ఆమె చివరి రోజుల్లో ఎక్కడ ఉందో తెలిస్తే షాక్‌ అవుతారు. అంతకంటే దారుణం మరోటి లేదని చెప్పొచ్చు. 
 

Savitri

మహానటి సావిత్రి సౌత్‌ ఇండియన్‌ సినిమాని శాషించిన నటి. మహానటి అనే పదానికి పరిపూర్ణమైన అర్థాన్నిచ్చిన నటి. స్టార్‌ హీరోలకు దీటుగా రాణించి మెప్పించిన నటి. ఇంకా చెప్పాలంటే ఓ దశలో స్టార్‌ హీరోలను మించిన ఇమేజ్‌, క్రేజ్‌, స్టార్‌డమ్‌ని పొందిన నటి. అలాగే స్టార్‌ హీరోలకు దీటుగా పారితోషికం అందుకున్న నటి. మేల్‌ స్టార్స్ కి మించిన కీర్తి పొందిన నటి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Savitri

ఆమె ఎంతటి పీక్‌ స్థాయికి ఎదిగిందో, అంతే పాతాళానికి పడిపోయిన నటి. రాయల్‌ లైఫ్‌ నుంచి, రాజులను తలపించే రాజసం అనుభవించి, కటిక పేదరికంకి పడిపోయిన నటి. తాను ఎంతటి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిందో అంతకంటే దీనస్థితికి పడిపోయిన నటి. కోట్లాది మంది అభిమానులను సంపాదించి, దిక్కులేని స్థితిలో మరణించిన నటి. అందరు ఉన్నా, అన్నీ ఉన్నా, ఒంటరైపోయిన నటి. సింపుల్‌గా ఆమె పీక్‌ని చూసింది, పాతాళాన్ని చూపింది. దారుణ స్థితిలో మరణించింది.  


సావిత్రి జీవితంలో ప్రేమ పెద్ద శత్రువుగా మారింది. మంచి తనం అంతకంటే పెద్ద విలన్‌గా మారింది. సేవగుణం, అమాయకత్వం ఆమెని మోసపోయేలా చేసింది. ప్రేమ పేరుతో భర్త, మంచి తనం పేరుతో ఆమె చుట్టూ ఉన్నవాళ్లు, అమాయకత్వం కారణంగా తనని నమ్మిన వాళ్లే మోసం చేశారు. ఇలా అన్ని రకాలుగా మోసపోయిన సావిత్రి దీన స్థితిలో తాగుడుకి బానిసై కోమాలోకి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె జీవితం, ఆమె మరణం ఎంతో మందికి ఆదర్శం, గుణపాఠం. స్టార్స్ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పించింది. 
 

అయితే సావిత్రి చివరి రోజుల గురించి నటుడు గుమ్మడి(వెంకటేశ్వరరావు) ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. అప్పట్లో ఆయన ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి గురించి చెప్పారు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయితే ఓ సారి తాను అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉంటే, పరామర్శించడానికి వచ్చి తన వద్ద ఎప్పుడో తీసుకున్న వెయ్యి రూపాయలు తన తల దిండుకింద పెట్టి వెళ్లిపోయిందట. అదేంటమ్మా అని అడిగితే తాను చనిపోయేలోపు ఎవరికీ బాకీ ఉండకూడదని చెప్పిందట.

అంతటి గొప్ప హృదయం ఆమెదని చెప్పారు గుమ్మడి. మరోవైపు ఓ సినిమాలో తాను పేదరికంతో మగ్గే లేడీ పాత్ర పోషించిందట సావిత్రి. మధ్యాహ్నం అందరు లంచ్‌ చేస్తున్నారు. అందరు ఆర్టిస్ట్ లకు ఇంటి నుంచి క్యారేజీలు వచ్చేవట. అలా రాని వారికి ప్రొడక్షన్‌ వాళ్లు భోజనాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఆ టైమ్‌లో సావిత్రికి ఇంటి నుంచి భోజనం రాలేదు, అలాగే ప్రొడక్షన్‌ వాళ్లు కూడా భోజనాలు చేయలేదు. 
 

దీంతో తాను ఒంటరిగా అలా కూర్చుండిపోయిందట. అందరు భోజనం చేస్తుంటే తాను మాత్రం తినకుండా ఉండిపోయిందట. ఆ పరిస్థితి చూసి తాను అడిగాడట. లేదు బాబాయ్‌ ఆకలిగా లేదని చెప్పిందట. అలా కాదని ఆమెతో మాట్లాడి భోజనం పెట్టగా, కన్నీళ్లు పెట్టుకుందట. ఆ టైమ్‌లో తన  హృదయం చలించిపోయిందని తెలిపారు గుమ్మడి. తాను సావిత్రి గొప్ప స్థాయిని చూశాను, ఇలాంటి ధీన స్థితిని చూశాను అని వెల్లడించారు.

అంతేకాదు ఆమె చివరి రోజుల్లో ఓ గ్యారేజీలో ఉండేదట. ఆమె సంపాదించిన ఆస్తిపాస్తులు లెక్క కడితే అవి కొన్ని వందల కోట్లు విలువ ఉంటుందని, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడలో ఎన్నో ఆస్తులు కొనుగోలు చేసిందని, వాటి విలువ వందల, వేల కోట్లు ఉంటాయని, కానీ అవన్నీ పోగొట్టుకుందని, అన్నీ పోయి ఒక గ్యారేజీలో చివరి రోజుల్లో నివసించిందని చెప్పారు గుమ్మడి. 

read more: `జై హనుమాన్‌`గా స్టార్‌ డైరెక్టర్‌, ఇద్దరు హీరోల మధ్యనే అసలు ఫైట్‌?.. గూస్‌బంమ్స్ అప్‌డేట్‌

also read: మోక్షజ్ఞ ఎంట్రీ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్‌, ఏ పాత్రలో కనిపిస్తున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే ?
 

Latest Videos

click me!