గంగూబాయ్‌గా నిహారిక రచ్చ.. అచ్చు దించేసి అలియాభట్‌ కే జలసీ పుట్టిస్తున్న మెగా డాటర్‌.. బన్నీ వైఫ్‌ కామెంట్‌

Published : Sep 19, 2022, 01:10 PM ISTUpdated : Sep 19, 2022, 01:12 PM IST

మెగా డాటర్ నిహారిక నటిగా రాణించలేకపోయింది. దీంతో ఇప్పుడు నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటుంది. కానీ తనలోని నటి మాత్రం బయటకొస్తూనే ఉన్నారు. తాజాగా గంగూబాయ్‌గా మారి షాకిచ్చింది నిహారిక.   

PREV
16
గంగూబాయ్‌గా నిహారిక రచ్చ.. అచ్చు దించేసి అలియాభట్‌ కే జలసీ పుట్టిస్తున్న మెగా డాటర్‌.. బన్నీ వైఫ్‌ కామెంట్‌

మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక(Niharika) అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఉన్నట్టుండి ఆమె గంగూబాయ్‌గా మారింది. తెల్ల చీర, ఎర్రటి లిప్ స్టిక్‌, నోట్లో పాన్‌, చేతిలో బ్యాగ్‌ ధరించి అచ్చు గంగూబాయ్‌(Gangubai) లుక్‌లోకి మారింది. ఓ పార్టీలో ఆమె ఇలా గంగూబాయ్‌గా రచ్చ చేయడం విశేషం. తాజాగా ఈ ఫోటోలను నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 
 

26

ఇందులో గంగూబాయ్‌ లుక్‌లో నిహారిక అదరగొడుతుంది. ఆమె నడక నుంచి కట్టుబొట్టు వరకు గంగూబాయ్‌ని అచ్చు దించేసింది. బాలీవుడ్‌ చిత్రం `గంగూబాయ్‌ః కథియవాడి` ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో గంగూబాయ్‌గా అలియాభట్‌(Alia Bhatt) నటించి అద్భుతమైన అదరగొట్టింది. కామతిపురలో వేశ్య వృత్తి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా, అట్నుంచి పొలిటికల్‌ లీడర్‌గా ఎదిగిన గాంగూబాయ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 
 

36

తాజాగా అలియాభట్‌ గంగూబాయ్‌ గా అదరగొట్టిన నేపథ్యంలో ఇప్పుడు నిహారిక ఆమెలా ముస్తాబై ఓ వీడియో చేయడం విశేషం. అయితే సండే సందర్భంగా ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిహారిక ఫోటోలు, ఆమె వీడియో క్లిప్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

46

ఈ సందర్భంగా నిహారిక చెబుతూ, గంగూని ఛానెలింగ్‌ చేస్తుంది. మీకు తెలుసో, తెలియదో, నేను ఇలాంటి కాస్ట్యూమ్స్‌ పార్టీలను ఇష్టపడతానని తెలిపింది. ఇందులో ఉన్న వీడియోలో ఆమెని ఆటపట్టిస్తున్నట్టుగా ఇద్దరు కుర్రాళ్లున్నారు. `నా వెనుక ఉన్న కోతులను పట్టించుకోకండి` అని పోస్ట్ చేయడం విశేషం. దీనిపై బన్నీ వైఫ్‌ అల్లు స్నేహారెడ్డి స్పందించింది. `సూపర్‌` అంటూ కామెంట్‌ పెట్టడం విశేషం.

56

నిహారిక మొదట యాంకర్‌గా రాణించింది. ఆ తర్వాత `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. తమిళంలో `ఓరు నల్ల నాల్‌ పాథు సోల్రెన్‌`, `హ్యాపీ వెడ్డింగ్‌`, `సూర్యకాంతం` చిత్రాల్లో నటించి మెప్పించింది. మరోవైపు `సైరా`లోనూ చిన్న పాత్రలో మెరిసింది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఇక సినిమాలకు దూరమైంది.
 

66

2020లో ఆమెకి మ్యారేజ్‌జరిగిన విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో ఉదయ్‌పూర్‌ కోటలో గ్రాండ్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్‌ చేస్తూనే నిర్మాతగా బిజీ అవుతుంది నిహారిక. పింక్‌ఎలిఫెంట్‌ పిక్చర్స్ ద్వారా వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories