పెదనాన్న కోసం 12 ఏళ్లలో తొలిసారి అక్కడికి ప్రభాస్.. 50 వేల మంది కోసం ఏర్పాట్లు..

First Published Sep 19, 2022, 1:00 PM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11న అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషమ పరిస్థితిని దిగమింగుతూ ప్రభాస్ తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11న అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషమ పరిస్థితిని దిగమింగుతూ ప్రభాస్ తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ఎదగడానికి అవసరమైన ఫ్లాట్ ఫామ్ సెట్ చేసింది కృష్ణం రాజే. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయినట్లు అయింది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టాడట. దీని కోసం ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత తొలిసారి మొగల్తూరులో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 28న ప్రభాస్ మొగల్తూరు రానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ప్రభాస్ అక్కడే ఉంది కృష్ణం రాజు సంస్కరణ సభ, సమారాధన జరిపించనున్నట్లు తెలుస్తోంది. 

దీనికోసం మొగల్తూరులో ఉన్న కృష్ణంరాజు ఇంటికి రంగులు వేయిస్తున్నారు. ఫర్నిచర్ కూడా మారుస్తున్నారు. దీనికోసం 50 మంది వర్కర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న హైదరాబాద్ లో కృష్ణంరాజు 10వ రోజు జరిపించనున్నట్లు తెలుస్తోంది. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కార్డులు అందించారు. 

ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ మొత్తం మొగల్తూరు వెళ్లనుంది. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు దిన కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళి ఇప్పుడు తన పెదనాన్న కోసం వెళుతున్నాడు.  

కృష్ణంరాజు సమారాధనలో భాగంగా మొగల్తూరు గ్రామంలో 50 వేలమందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ద్రాక్షారామం నుంచి వంటవాళ్ళని రప్పిస్తున్నారట. 

కృష్ణంరాజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏడాదికి కనీసం రెండుసార్లు అయినా మొగల్తూరు వెళ్లి తన నివాసంలో విశ్రాంతి తీసుకునేవారట. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు కృష్ణం రాజు మొగల్తూరు వెళ్ళలేదు. 

click me!