ఆ తర్వాత ఆమె ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. `నాన్న కూచి`, `ముద్దపప్పు ఆవకాయి`, `మ్యాడ్ హౌజ్`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హెలో వరల్డ్`, `డెడ్ ఫిక్సెల్స్` వంటి సిరీస్‌లు నిర్మించింది. ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. యంగ్ టీమ్‌తో కలిసి ఆమె మొదటిసారి సినిమాని నిర్మిస్తుండటం విశేషం.