Niharika: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను అంతే లవ్‌ చేస్తాడు.. జబర్దస్త్ కమెడియన్‌పై నిహారిక కామెంట్‌

Published : Mar 31, 2026, 09:51 AM IST

నిహారిక.. జబర్దస్త్ కమెడియన్‌ గెటప్‌ శ్రీనుపై ప్రశంసలు కురిపించింది. తనని ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, శ్రీను కూడా అంతే లవ్‌ చేస్తాడని, కేరింగ్‌ చేస్తాడని అందరి ముందు వెల్లడించింది నిహారిక. 

PREV
14
నిర్మాతగా దూసుకుపోతున్న నిహారిక

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. ఫ్యామిలీ లైఫ్‌ పరంగానూ ఇబ్బందులు ఫేస్‌ చేసింది. కానీ ఇప్పుడు నిర్మాతగా మాత్రం సక్సెస్‌ అవుతుంది. ఇప్పటికే `కమిటీ కుర్రోళ్లు` చిత్రంతో హిట్‌ కొట్టింది. దీనికి అనేక అవార్డులు వచ్చాయి. ఇప్పుడు `రాకాస` అనే చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన సారిక జంటగా నటించారు. ఏప్రిల్‌ 3న ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

24
ఇంట్లో వాళ్ల లాగా గెటప్‌ శ్రీను ప్రేమిస్తారు - నిహారిక

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, జబర్దస్త్ కమెడియన్‌ గెటప్‌ శ్రీనుపై ప్రశంసలు కురిపించింది. తన ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను కూడా అంతే ప్రేమిస్తాడని తెలిపింది. తనని బాగా చూసుకుంటాడని వెల్లడించింది. ఆమె చెబుతూ, జబర్దస్త్ కమెడియన గెటప్‌ శ్రీనుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా నాన్న వల్ల చాలా మంది పరిచయం అయ్యారు. ఎంతో మందిని కలిశాను. కానీ నేను కనుక్కొన్న బెస్ట్ బెస్ట్ బెస్ట్ పర్సన్‌ గెటప్‌ శ్రీను. బ్లడ్‌ రిలేషన్‌ లేకపోతే ఒక చెల్లిలాగ అంత ప్రేమ ఇతరులకు ఎందుకు ఉంటుంది అనుకునేదాన్ని. కానీ శ్రీనుగారిని చూశాక అంతా పోయింది. మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను కూడా అంతే లవ్‌ చేస్తాడు. అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు` అని చెప్పింది నిహారిక.

34
గెటప్‌ శ్రీనుకి నిహారిక బంపర్‌ ఆఫర్‌

ఇంకా మాట్లాడుతూ, అందర అన్నారు జాలీ జాలీగా కావాలంటే శ్రీను వద్దకు వెళ్లాలి అని, కానీ సెట్‌ లో బాగా లేకపోతే, నేను ఫస్ట్ శ్రీను వద్దకే వెళ్తాను. నేను ఏం చెప్పినా, ముందు మీరు రిలాక్స్ అవ్వండి, వాటర్‌ తాగండి, టీ తాగండి అని చెబుతుంటారు. చాలా కేర్‌ తీసుకుంటారు. షూటింగ్‌ టైమ్‌లో అంత క్లోజ్‌ కాలేదుగానీ, ప్రమోషన్స్ టైమ్‌లో ఇంత క్లోజ్‌ అయ్యాం` అని చెప్పింది. అంతేకాదు గెటప్‌ శ్రీనుకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. `బరి` సినిమాలో అతను ఉంటాడని ప్రకటించింది. అన్నయ్య వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక `బరి` సినిమాని నిర్మిస్తుంది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. వాలీబాల్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్, విలేజ్‌ డ్రామా అది. అందులో గెటప్‌ శ్రీను కూడా ఉంటాడని నిహారిక చెప్పడం విశేషం.

44
ఏప్రిల్‌ 3న రాకాస మూవీ రిలీజ్‌

ఇక `రాకాస` మూవీ కామెడీ, ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో థ్రిల్లర్‌తోపాటు కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని టీమ్‌ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకి విశేషమైన స్పందన లభించింది. నిహారిక ఇలా మంచి కాన్సెప్ట్, మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ రాణిస్తోంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది. అంతేకాదు నిహారిక నుంచి వస్తోన్న సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే పేరుని సొంతం చేసుకోవడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories