రంగస్థలం చిత్రం 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ఈ మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ చిత్రంతో రాంచరణ్ నటుడిగా మరో స్థాయికి చేరారు.
లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ లాంటి మూవీ రంగస్థలం. మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన ఈ మూవీ టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. పది కాలాల పాటు నిలిచిపోయే చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. రాంచరణ్ అయితే నట విశ్వరూపం ప్రదర్శించారు. చిట్టిబాబు పాత్రలో చేసిన అల్లరి, పండించిన ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది.
25
సమంతని ఈ చిత్రంలో హీరోయిన్ గా..
ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా రంగస్థలం విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంతని ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవడం తనకి ఇష్టం లేదు అని సుకుమార్ అన్నారు. ఎవరైనా కొత్త అమ్మాయి, లేదా నార్మల్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నా.
35
రాంచరణ్, సమంత ఇద్దరూ స్టార్లే
కొన్ని కాంబినేషన్స్ వల్ల సమంతనే తీసుకోవాల్సి వచ్చింది. రాంచరణ్, సమంత ఇద్దరూ స్టార్లే. ఇద్దరు స్టార్స్ ని సెట్ లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా అని సుక్కు తెలిపారు. కానీ సమంత ఒక్కో సీన్ లో నటించే విధానం చూసినప్పుడల్లా నా చెంప చెళ్లుమనిపించినట్లు అయింది. సమంత అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ఇంప్రెస్ అయిపోయా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పా. ఇకపై సమంతతో సినిమాలు చేస్తూనే ఉండాలి అని తనకు అనిపించినట్లు సుకుమార్ తెలిపారు.
అప్పటికి సమంతకు వివాహం జరిగింది. అయినా కూడా రంగస్థలం మూవీలో లిప్ లాక్ సీన్ లో నటించింది. ఆ సీన్ చేస్తున్నప్పుడు, సమంతకు వివరిస్తున్నప్పుడు ఆమెకి పెళ్లయిందా కాలేదా అని ఆలోచించలేదు. లిప్ లాక్ సీన్ ని ఒక ఆర్ట్ ఫామ్ లా మాత్రమే చూడాలి. ప్రేమని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు ఆ విధంగా ముద్దు పెట్టుకుని ప్రేమని తెలియజేస్తుంది. దానిని కళాత్మకంగా మాత్రమే చూడాలి అని సుకుమార్ అన్నారు.
55
80వ దశకంలో అంత రొమాన్స్ ?
80వ దశకంలో అంత రొమాన్స్ ఉండేదా అని యాంకర్ ప్రశ్నించగా.. మీది పల్లెటూరు అయితే మీకు అర్థం అవుతుంది అని సుకుమార్ సమాధానం ఇచ్చారు. అప్పట్లో సరసం అనేది లైఫ్ లో ఒక భాగంగా ఉండేది. దానిని వల్గర్ గా చూసేవాళ్ళు కాదు అంటూ సుకుమార్ బదులిచ్చారు.