అమ్మా kajal నీ వాయిస్ అది వాయిస్ కాదమ్మా.. ఎక్కడున్నా వినిపించేస్తుంది. మిమ్మల్ని దేవుడే రక్షించాలి అని ఆమె అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేస్తారు. కాసేపు మానస్ తో ఆమె ముచ్చటించి హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత షణ్ముఖ్ వాష్ రూమ్ కి వెళుతుండగా బిగ్ బాస్ ఫ్రీజ్ చెబుతారు. దీనితో సిరి, కాజల్, రవి అక్కడికి చేరుకొని షణ్ముఖ్ ని ఆటపట్టిస్తారు. షణ్ముఖ్ ఫ్రీజ్ లో ఉండగా చీర కట్టి, గర్భవతి మహిళగా మేకప్ వేస్తారు. ఆ సన్నివేశం సరదాగా ఉంటుంది. బిగ్ బాస్ షణ్ముఖ్ ని రిలాక్స్ చేసే వరకు ఇతర సభ్యులు షణ్ముఖ్ ని ఆడుకుంటారు.