80, 90 దశకం నాటి కథలకు ఇప్పుడు మాంచి డిమాండ్ ఉంది. విలేజ్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కథనంతో ఆకట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనిని అర్థం చేసుకున్న దర్శకుడు యదు వంశీ 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రాన్ని ప్లాన్ చేసుకుని చక్కగా ప్రజెంట్ చేశాడు. మొబైల్ ఫోన్లు లేని కాలంలో స్నేహితుల మధ్య జరిగే సంభాషణలు.. పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని చూపిస్తూ మంచి కథని అందించడంలో మార్కులు కొట్టేశారు.
జాతరలో కుర్రాళ్ళు చేసే అల్లరి నవ్విస్తుంది. అదే విధంగా స్నేహం కోసం వీళ్ళు ఎంతదూరమైనా వెళతారు అనే సన్నివేశాలని కూడా దర్శకుడు హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. అప్పట్లో పల్లెటూర్లలో కల్మషం లేని మనుషులే కనిపిస్తారు. కానీ కులాల పేరుతో జరిగిన రాజకీయ సంఘటనలని చాలా సార్లు విన్నాం. అదే తరహాలో స్నేహితుల మధ్య చిచ్చు రగిల్చే అంశాలు ఉత్కంఠ భరింతంగా ఉంటాయి.