అంజలిని ప్రేమించి మోసం చేసిన హీరో ఎవరు..? డిప్రెషన్ నుంచి ఆమె ఎలా బయటపడింది..?

First Published | Aug 10, 2024, 6:01 PM IST

ఎప్పుడు పెళ్ళఇ వార్తలతో వైరల్ అవుతుంటుంది హీరోయిన్ అంజలి.. ఇప్పుడు మాత్రం తన పాత ప్రేమ వార్తతో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ భాష
 

anjali

అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా.. తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది అంజలి.  తమిళ సినిమా అంజలి  ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ విధంగా రామ్‌ దర్శకత్వం వహించిన కరతు తమిళ్‌ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది అంజలి. 

నాగ చైతన్య కంటే ముందు శోభిత ఎఫైర్ నడిపింది ఎవరితో...? అతనికి ఎందుకు బ్రేకప్ చెప్పింది..? నిజమెంత..?

Kollywood Actress Anjali

తొలి సినిమాతోనే తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో కోలీవుడ్ జనాల అభిమానం చూరగొంది. తమిళనాట వరుస సినిమాలు చేసిన అంజలి.. అక్కడి నుంచి మళ్ళీ తెలుగులో అడుగు పెట్టింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీత పాత్రను మద్రించింది అంజలి. అప్పటి నుంచి తెలుగులో కూడా తన స్టార్ డమ్  చూపించింది బ్యూటీ. 
 


jai Anjali

హీరోయిన్ గా స్టార్ డమ్ ఉన్నా.. వివాదాలకు కొదవ లేని నటిగా పేరు తెచ్చుకున్న అంజలి 'జర్నీ సినిమాలతో తనతో కలిసినటించిన హీరో  జైతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి జీవిస్తున్నారని, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరిగినా, అభిమానులు ఆశించినట్లు ఏమీ జరగలేదు. ఇద్దరూ స్నేహితులమని చెప్పి ఈ సమాచారానికి ముగింపు పలికారు.

jai Anjali

అయితే అంజలి పేరు చెప్పగానే.. చాలా మందికి జైతో బ్రేకప్  స్టోరీ ఎక్కువగా గుర్తుకు వస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహరంలో.. మరో కోణం గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. జై అంజలిని ప్రేమ పేరుతో మోసం చేశాడని కోలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరిగింది. జర్నీ సినిమాతో వీరికి స్నేహం ఏర్పడి.. ఆ స్నేహం వారి మధ్య ప్రేమగా మారిందని.. ఆతరువాత వీరు సహజీవనం కూడా చేశారనేది తమిళ ఇండస్ట్రీలో టాక్. 

jai Anjali

అయితే అంజలితో రిలేషన్ లో ఉన్న సమయంలో అంజలికి సంబంధించిన విషయాలు జై లీడ్ చేసేవారట. సినిమాల విషయంలో కూడా ఆయన పెత్తనమే నడిచేదట.. జై పర్మీషన్ లేకుండా అంజలి కూడా ఎవరితో మాట్లాడేది కాదట. జై మూలంగా అంజలి చాలా ఆఫర్లు కూడా కోల్పోయిందని అంటుంటారు.  అంజలికి రావలసిన సినిమాలు చాలా జై వల్లే కోల్పోయిందని అంటారు. 

jai Anjali

అంతే కాదు అంజలు ఆస్తులు.. ఆమె సంపాదించుకుంది కూడా జై వల్లే కోల్పోయిందన్న టాక్ కూడా గట్టిగా నడిచింది. ఆతరువాత అంజలి తన కెరీర్ కోల్పోతున్నాను అని గ్రహించి... జైకు బ్రేకప్ చెప్పి.. కెరీర్ పై దృష్టి పెట్టిందట. అయితే అప్పటికే అంజలి చాలా లాస్ అయ్యిందని సమాచారం. ఇక ఇఫ్పుడు సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ.. మళ్లీ కెరీర్ నుపరుగులు పెట్టిస్తోంది బ్యూటీ. అలా అంజలి ప్రేమ మత్తులో పడి చాలా నష్టపోయిందని కోలీవుడ్ టాక్. 

Latest Videos

click me!